English | Telugu

పుష్ప‌.. అంచ‌నాల‌ను మించి ఫ‌స్ట్ డే వ‌సూళ్లు రాబ‌ట్టిన హిందీ వెర్ష‌న్‌!

'పుష్ప‌'గా అల్లు అర్జున్ హిందీ బెల్ట్‌ను బ‌లంగా తాకాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప: ది రైజ్' హిందీ వెర్ష‌న్ అంచ‌నాల‌ను మించి ట్రేడ్ విశ్లేష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ తొలిరోజు రూ. 3 కోట్ల నెట్ క‌లెక్ష‌న్లు సాధించింది. స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోయినా, మార్కెట్లో హాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ 'స్పైడ‌ర్‌మ్యాన్ నో వే హోమ్' ఉన్నా, స్క్రీన్లు త‌క్కువ‌గా ల‌భించినా రూ. 3 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించ‌డం పెద్ద విశేషంగా చెప్తున్నారు. మ‌ల్టీప్లెక్సుల‌లో డీసెంట్ క‌లెక్ష‌న్లు సాధించిన ఈ సినిమా, సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో మార్నింగ్ షోస్ కంటే ఈవెనింగ్ షోస్‌కు ఎక్కువ వ‌సూళ్లు సాధించింది.

Also read:మార్నింగ్ షోస్‌కు 'పుష్ప‌' ఆక్యుపెన్సీ ఇదే!

కూలివాడి నుంచి ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్‌గా ఎదిగే పుష్ప‌రాజ్ క‌థ‌తో సుకుమార్ తీసిన 'పుష్ప' మూవీని హిందీ ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుండ‌టంతో దేశ‌వ్యాప్తంగా అల్లు అర్జున్ మార్కెట్ పెరుగుతోంద‌నేందుకు సంకేత‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. నిజానికి హిందీ వెర్ష‌న్‌కు నిర్మాత‌లు పెద్ద‌గా ప్ర‌మోష‌న్ నిర్వ‌హించింది లేదు. కేవ‌లం యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన సాంగ్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తోటే 'పుష్ప‌'పై హిందీ ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

Also read:'పుష్ప' మూవీ రివ్యూ

సినిమా విడుద‌ల‌య్యాక టైటిల్ రోల్‌లో బ‌న్నీ ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం వారిని అమితంగా ఆక‌ట్టుకుంటోంద‌ని వ‌సూళ్లు తెలియ‌జేశాయి. మ‌హారాష్ట్ర‌లోని మాస్ ఏరియాల్లో 'పుష్ప‌'ను చూసేందుకు ప్రేక్ష‌కులు అధిక సంఖ్య‌లో థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. సెకండ్ లాక్‌డౌన్ త‌ర్వాత మ‌హారాష్ట్ర‌లో థియేట‌ర్లు తెరుచుకున్నాక ఒక‌రోజు రూ. 3 కోట్ల వ‌సూళ్లు రావ‌డం.. అదీ ఒక డ‌బ్బింగ్ మూవీకి రావ‌డం.. అసాధార‌ణ విష‌యంగా పేర్కొంటున్నారు. నిజానికి 'పుష్ప' రూ. 2 కోట్ల మార్కును దాట‌డం కూడా క‌ష్ట‌మ‌ని అక్క‌డివాళ్లు భావించారు. వారి అంచ‌నాల‌ను మించి తొలిరోజు రూ. 3 కోట్ల‌ను దాటి స‌త్తా చాటాడు అల్లు అర్జున్‌.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.