English | Telugu

క్రేజీ కాంబినేషన్.. రాజమౌళి దర్శకత్వంలో రణ్‌ బీర్‌ కపూర్!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయాలని ఎందరో స్టార్స్ ఆశపడుతుంటారు. బాలీవుడ్ స్టార్ రణ్‌ బీర్‌ కపూర్ సైతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని ఆశపడుతున్నాడు. తాజాగా జరిగిన 'బ్రహ్మాస్త్ర' మూవీ ప్రెస్ మీట్ లో రాజమౌళి, రణ్‌ బీర్‌ మాటలను గమనిస్తే.. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.

Also Read:'పుష్ప' మూవీ రివ్యూ

శనివారం హైదరాబాద్ లో రాజమౌళితో కలిసి బ్రహ్మాస్త్ర మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. "బాలీవుడ్ లో నా ఫేవరెట్ యాక్టర్ రణ్‌ బీర్‌ అని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే తను నటిస్తున్నట్లు అసలు అనిపించదు. ఓవర్ గా ఎక్స్ ప్రెస్ చేయడు. ఇంటెన్సిటీ అంతా కళ్ళలోనే చూపిస్తాడు. సంజూ, రాక్ స్టార్ వంటి సినిమాల్లో ఆయన చేసిన ఫర్మార్మెన్స్ హార్డ్ హిట్టింగ్ గా టాప్ అఫ్ ది వరల్డ్ అన్నట్టు ఉంటాయి" అంటూ ప్రశంసించాడు.

Also Read:అత్తగారింట్లో 'కత్రినా' వండిన తొలి వంటకం ఏంటో తెలుసా?

బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో రణ్‌ బీర్‌ కూడా రాజమౌళిపై తనకున్న అభిమాని చాటుకున్నాడు. రణ్‌ బీర్‌ వేదిక పైకి రాగానే రాజమౌళి కాళ్లకి దణ్ణం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అంతేకాకుండా, ఇండియాలోనే కాదు టోటల్ వరల్డ్ లోనే ప్రజెంట్ నా ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి అని రణ్‌ బీర్‌ చెప్పాడు. అలాగే తెలుగులో సినిమా చేస్తారా అన్న ప్రశ్నకు రణ్‌ బీర్‌ స్పందిస్తూ.. తప్పకుండా చేస్తానని, రాజమౌళి గారు కూడా ఇది వింటున్నారని అన్నాడు. అంతేకాదు సినిమాకి భాషతో సంబంధం లేదని, కథ నచ్చితే ఏ భాషలోనైనా సినిమా చేస్తానని రణ్‌ బీర్‌ చెప్పుకొచ్చాడు.

Also Read:పుష్ప‌.. అంచ‌నాల‌ను మించి ఫ‌స్ట్ డే వ‌సూళ్లు రాబ‌ట్టిన హిందీ వెర్ష‌న్‌!

బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో రాజమౌళి, రణ్‌ బీర్‌ ఒకరిపై ఒకరు చాటుకున్న అభిమానాన్ని చూస్తుంటే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ ని ఏ ప్రొడ్యూసర్ సెట్ చేస్తారో చూడాలి. ఆ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.