Read more!

English | Telugu

కండోమ్ టెస్ట‌ర్‌గా ర‌కుల్ ప్రీత్ లుక్ ఇదే!

 

రోనీ స్క్రూవాలాకు చెందిన RSVP త‌మ ప్రాజెక్టులో కండోమ్ టెస్ట‌ర్‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించ‌నున్న‌ట్లు అనౌన్స్ చేసిన‌ప్ప‌ట్నుంచీ ఆడియెన్స్ క్యూరియాసిటీ వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నారు. 'ఛ‌త్రీవాలీ' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సోష‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో మునుపెన్న‌డూ చూడ‌ని వైవిధ్య‌మైన క్యారెక్ట‌ర్‌లో ర‌కుల్ క‌నిపించ‌బోతోంది. ఇటీవ‌ల ఈ మూవీ షూటింగ్ లక్నోలో ప్రారంభ‌మైంది. ఉద్యోగం కోసం తీవ్ర నిరీక్ష‌ణ‌లో ఉన్న ఓ లేడీ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ క‌ర్నాల్ అనే ఓ చిన్న టౌన్‌లో కంటోమ్ టెస్ట‌ర్‌గా మారుతుంది. ఆ విష‌యాన్ని త‌న చుట్టుప‌క్క‌ల ఉండేవారికి తెలీకుండా సీక్రెట్‌గా దాచ‌డానికి ఎలా క‌ష్టాలు ప‌డుతుంద‌నేది 'ఛ‌త్రీవాలీ'లోని ప్ర‌ధానాంశం. 

డైరెక్ట‌ర్ తేజ‌స్ ప్ర‌భా విజ‌య్‌ డియోస్క‌ర్ మాట్లాడుతూ, "మా సినిమా ఒక సోష‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. కండోమ్స్ వాడ‌కం విష‌యంలో స‌మాజంలో ఉన్న అపోహ‌ల్ని తొల‌గించడం ఈ సినిమా ప్ర‌ధానోద్దేశం. షూటింగ్ మొద‌లైనందుకు నిజంగా ఎగ్జ‌యిటింగ్‌తో ఉన్నాం. త‌ను పోషించే ప్ర‌తి పాత్ర‌కూ ర‌కుల్ ఫ్రెష్‌నెస్ తీసుకువ‌స్తుంది. ఇందులోని ప్ర‌ధాన పాత్ర‌కు ఆమె స‌రిగ్గా స‌రిపోతుంద‌ని ఆశిస్తున్నాం. ఈ సినిమాలోని కామెడీని అంద‌రూ ఆస్వాదిస్తారు" అని చెప్పాడు.

ర‌కుల్ ప్రీత్ మాట్లాడుతూ, "ఇది చాలా ఇంట‌రెస్టింగ్ స‌బ్జెక్ట్‌. నా క్యారెక్ట‌ర్ జ‌ర్నీని ప్రారంభిస్తున్నందుకు చాలా థ్రిల్‌గా ఉంది. కొన్ని స‌మ‌స్య‌ల‌ని ఆహ్లాద‌క‌ర‌మైన ప‌ద్ధ‌తిలో హైలైట్ చేయ‌డం ఇంపార్టెంట్‌. అదే న‌న్ను ఎగ్జ‌యిట్ చేసింది" అని చెప్పింది.