Read more!

English | Telugu

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ రాజ్‌కుమార్ రావ్‌-పత్ర‌లేఖ పెళ్లి వేడుక మొద‌లైంది!

 

బాలీవుడ్‌లో అత్యంత ఇష్ట‌ప‌డే జంట‌ల్లో ఒక‌రైన రాజ్‌కుమార్ రావ్‌, ప‌త్ర‌లేఖ ఎట్ట‌కేల‌కు పెళ్లిపీట‌లు ఎక్కుతున్నారు. చండీగ‌ఢ్‌లో జ‌రుగుతున్న వారి పెళ్లి వేడుక‌కు సంబ‌ధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఒక ద‌శాబ్దం కాలంపాటు ప్రేమ‌లో మునిగితేలిన త‌ర్వాత ఆ ఇద్ద‌రూ జీవితంలో కీల‌క‌మైన పెద్ద అడుగు వేస్తున్నారు.

పెళ్లి వేడుక‌లో రాజ్‌కుమార్ రావ్‌, ప‌త్ర‌లేఖ ఇద్ద‌రూ తెలుగు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ క‌నిపించారు. ఆన్‌లైన్‌గా వైర‌ల్ అవుతున్న ఓ వీడియోలో రాజ్‌కుమార్ త‌న వ‌ధువు కోసం మోకాలిపై కూర్చోవ‌డం మ‌నం చూడొచ్చు. దానికి ప‌త్ర‌లేఖ ఇచ్చిన రియాక్ష‌న్ మిస్స‌వ‌కూడ‌దు. త‌న జీవిత స‌హ‌చ‌రుడు కాబోతున్న వ్య‌క్తితో ఉంగ‌రం తొడిగించుకోవ‌డానికి త‌ను సైతం వంగి మోకాలితో కూర్చుంది. చూడ్డానికి ఆ దృశ్యం ఎంత ముచ్చ‌ట‌గా ఉంది!

వివాహ వేడుక‌లు ప్రారంభం కావ‌డానికి కొద్ది రోజుల ముందు ప‌త్ర‌లేఖ కోసం రాజ్‌కుమార్ ఒక స్పెష‌ల్ గిఫ్ట్‌ను రెడీ చేశాడు. ఆ ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిన‌ప్ప‌ట్నుంచీ ప్రియురాలి కోసం రాజ్‌కుమార్ చేత్తో ల‌వ్‌ లెట‌ర్స్ రాస్తూ వ‌స్తున్నాడు. వాటిలో ఇంత‌దాకా ప‌త్ర‌లేఖ చ‌ద‌వ‌ని ప్రేమ‌లేఖ‌ల‌ను ఇప్పుడు ఆమెకు కానుక‌గా అందిస్తున్నాడు.

ల‌వ్ సెక్స్ ఔర్ ధోకా, గాంగ్స్ ఆఫ్ వ‌సేపూర్ 2, కై పో చే, షాహిద్‌, క్వీన్‌, అలీగ‌ఢ్‌, ట్రాప్డ్‌, బ‌రేలీ కీ బ‌ర్ఫీ, న్యూట‌న్‌, స్త్రీ, జ‌డ్జిమెంట‌ల్ హై క్యా, లుడో లాంటి విభిన్న త‌ర‌హా చిత్రాల‌తో రాజ్‌కుమార్ రావ్ హైలీ టాలెంటెడ్ యాక్ట‌ర్‌గా పేరు సంపాదించాడు. మ‌రోవైపు రాజ్‌కుమార్ స‌ర‌స‌న న‌టించిన 'సిటీ లైట్స్' మూవీ ద్వారా న‌టిగా ఎంట్రీ ఇచ్చిన ప‌త్ర‌లేఖ‌. 'ల‌వ్ గేమ్స్‌', 'నాను కీ జాను' లాంటి సినిమాల‌తో పాటు టీవీ/ వెబ్ సిరీస్‌లలో న‌టించింది.