Read more!

English | Telugu

ఎన్సీబీ ఆఫీస్‌కు వ‌చ్చాడు.. ఒంట్లో బాగాలేద‌ని ఐదు నిమిషాల‌కు వెళ్లిపోయాడు!

 

బెయిల్‌పై జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన షారుక్ ఖాన్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ ప్ర‌తి శుక్ర‌వారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆఫీసులో అటెండెన్స్ వేసుకోవాలి. పోయిన శుక్ర‌వారం తొలిసారి అటెండెన్స్ వేయించుకున్న అత‌ను, ఈరోజు రెండోసారి ముంబైలోని ఎన్సీబీ ఆఫీసుకు వ‌చ్చాడు. త‌న లాయ‌ర్ల‌తో క‌లిసి నేరుగా మూడో అంత‌స్తుకు వెళ్లాడు. మ‌ధ్యాహ్నం 1:45 గంట‌ల‌కు ఆఫీసులో అడుగుపెట్టిన అత‌ను 1:50కి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆర్య‌న్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాల‌ని ఎన్సీబీ సిట్ అధికారులు ప్ర‌య‌త్నించ‌గా, అత‌నికి ఒంట్లో బాగాలేదనీ, మ‌రింత స‌మ‌యం కావాల‌నీ  అత‌ని లాయ‌ర్లు చెప్పారు.

ఆర్య‌న్‌ను ప్ర‌శ్నించ‌డానికి ఎన్సీబీకి చెందిన స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ (సిట్‌) ఇదివ‌ర‌కు ఓసారి ప్ర‌య‌త్నించింది. జ్వ‌రం త‌గిలిందంటూ అప్పుడు త‌ప్పించుకున్నాడు. అక్టోబ‌ర్ 29న జారీ చేసిన బెయిల్ ఆర్డ‌ర్‌లో ప్ర‌తి శుక్ర‌వారం ఎన్సీబీ ఆఫీసుకు హాజ‌రై సంత‌కం చేయాల‌నీ, పాస్‌పోర్టును అప్ప‌గించాల‌నీ ఆర్య‌న్‌ను బాంబే హైకోర్టు ఆదేశించింది.

క్రూయిజ్ షిప్ డ్ర‌గ్ కేసులో అరెస్ట‌యిన ఆర్య‌న్ 29 రోజుల పాటు పోలీసుల క‌స్ట‌డీలోనూ, జైలులోనూ గ‌డిపాడు. అక్టోబ‌ర్ 30న ఆర్థ‌ర్ రోడ్ జైలు నుంచి విడుద‌లై బ‌య‌ట‌కు వ‌చ్చాడు.