English | Telugu

కంగ‌నా.. నీ ద‌గ్గ‌రున్న డ‌బ్బుల‌తో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్ కొనొచ్చుగా!

దేశంలో ల‌క్ష‌లాది మంది కొవిడ్‌-19 బారిన ప‌డి ప్రాణాలు అర‌చేతుల్లో పెట్టుకొని బ‌తుకుండ‌గా వాళ్ల‌ను ఆదుకోవ‌డానికి ముందుకు రావ‌ట్లేదేమ‌ని బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను సోషల్ మీడియా ద్వారా జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా 'త‌లైవి' తార కంగ‌నా ర‌నౌత్‌పై ఐట‌మ్ గాళ్‌గా పేరుపొందిన రాఖీ సావంత్ వ్యంగ్యాస్త్రం విసిరింది.

బుధ‌వారం త‌న‌ను పాపరాజ్జి చుట్టుముట్ట‌డంతో చేతుల్లో రెండు శానిటైజ‌ర్ బాటిళ్లు, ముఖానికి డ‌బుల్ మాస్క్‌తో త‌న కారులోంచి కిందికి దిగింది రాఖీ. బ‌య‌ట‌కు వ‌చ్చీ రాగానే త‌న చుట్టూ గాల్లో శానిటైజ‌ర్‌ను వెద‌జ‌ల్లింది. త‌న మాస్క్ తీసి కెమెరామెన్ల‌ను త‌మ‌ను తాము కాపాడుకుంటూ, వాళ్ల ఫ్యామిలీస్‌ని కాపాడుకోమంటూ హెచ్చ‌రించింది. అంతే కాకుండా మంచి క్వాలిటీ శానిటైజ‌ర్ల‌ను వాడ‌మనీ, క‌రోనాను పెంచి పెద్ద‌చేయ‌వ‌ద్ద‌నీ సూచించింది.

"దేశం ప‌రిస్థితి బాగా లేద‌ని కంగ‌నా ర‌నౌత్ చెప్పారు. పీఎం న‌రేంద్ర మోడీ త‌ప్పో, ఒప్పో, చాలా ప్రాంతాల్లో ఆక్సిజ‌న్ దొర‌క‌ట్లేదు. దానిపై మీరేమంటారు?" అని మీడియా వాళ్లు రాఖీని అడిగారు. త‌న‌దైన శైలిలో "ఆక్సిజ‌న్ దొర‌క‌ట్లేదా? ఓహో! కంగ‌నా, ప్లీజ్ దేశానికి సేవ‌చెయ్యి. నీ దగ్గ‌ర చాలా డ‌బ్బుంది, ఆక్సిజ‌న్ కొని ప్ర‌జ‌ల‌కు డిస్ట్రిబ్యూట్ చెయ్యి." అని రిప్లై ఇచ్చింది రాఖీ.