Read more!

English | Telugu

బ‌ర్త్‌డేకి సంద‌డిలేని షారుక్ ఖాన్ ఇల్లు 'మ‌న్న‌త్‌'! దూరంగా వెళ్లిన సూప‌ర్‌స్టార్‌!!

 

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ బ‌ర్త్‌డే అంటే ముంబైలో ఎంత సంద‌డి ఉంటుంది! అలాంటిది క‌నీసం అత‌ని ఇల్లు మ‌న్న‌త్ ద‌గ్గ‌ర కూడా ఎలాంటి సంద‌డీ లేదు. అస‌లు మ‌నుషుల అలికిడే లేదు. అవును. న‌వంబ‌ర్ 2 షారుక్ పుట్టిన‌రోజు. కానీ అత‌ని బంగ‌ళా మ‌న్న‌త్ ద‌గ్గ‌ర ఎడారి వాతావ‌ర‌ణం నెల‌కొంది. కార‌ణం.. జ‌నం దృష్టి నుంచి దూరంగా త‌న కుటుంబాన్ని తీసుకొని ముంబై శివారు ప్రాంతం అలీబాగ్‌లోని త‌న ఫామ్‌హౌస్‌కు త‌ర‌లివెళ్లాడు షారుక్‌.

ఈ ఏడాది షారుక్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకోవ‌డం లేద‌ని ఆయ‌న ఫ్యామిలీకి క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక‌త‌ను వెల్ల‌డించాడు. "సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకొనే మూడ్‌లో షారుక్ ఖాన్ లేడు. ప్ర‌తి ఏటా ఆయ‌న ఈరోజు త‌న ఫ్యాన్స్‌ను క‌లుసుకొని, వారి శుభాకాంక్ష‌ల‌ను అందుకుంటుంటాడు. ఈసారి ఆ ఆచారాన్ని ఆయ‌న కొన‌సాగించ‌డం లేదు. కొద్ది రోజులు గ‌డిపేందుకు త‌న కుటుంబంతో క‌లిసి అలీబాగ్ ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. బెయిల్ కండిష‌న్స్ ప్ర‌కారం ఆర్య‌న్ ఖాన్ శుక్ర‌వారం ముంబైకి వ‌చ్చి ఎన్సీబీ ఆఫీసులో సంత‌కం చేసి వెళ్తాడు" అని అత‌ను తెలిపాడు.

ప్ర‌స్తుతం ఎవ‌రినీ క‌లిసి మాట్లాడే స్థితిలో షారుక్ లేడ‌ని ఆ ఫ్రెండ్ చెప్పాడు. "ప్ర‌స్తుతం ఆర్య‌న్ ఎదుర్కొంటున్న ఇబ్బందిక‌ర ప‌రిస్థితి దృష్ట్యా త‌మ కుటుంబానికి ఊపిరి పీల్చుకోవ‌డానికి కొంత స‌మ‌యం ఇవ్వాల్సిందిగా ఇండ‌స్ట్రీలోని త‌న క్లోజ్ ఫ్రెండ్స్‌కు షారుక్ చెప్పాడు" అని కూడా అత‌ను తెలిపాడు. క‌నీసం ఫోన్‌లో అయినా షారుక్‌ను విష్ చేద్దామ‌నుకున్న ఫ్రెండ్స్ సైతం ఆ ఫోన్ ఆఫ్‌లో ఉండ‌టంతో డిజ‌ప్పాయింట్ అయ్యారు. ఈసారి బ‌ర్త్‌డేకి క‌నీసం ఫోన్ కాల్స్‌ను కూడా ఆయ‌న రిసీవ్ చేసుకోవ‌ట్లేదు. దీన్ని బ‌ట్టి షారుక్ ఫ్యామిలీ ఎలాంటి స్థితిలో ఉందో అర్థం చేసుకోవాల్సిందే.