English | Telugu

బాప్‌రే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టుకు ప్రియాంక ఆదాయం రూ. 3 కోట్లా!

2021 ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్‌లో ప్రియాంకా చోప్రాకు చోటు లభించింది. 27వ స్థానంలో నిలిచిన ఆమె ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ పోస్ట్‌కు 403,000 డాల‌ర్లు (సుమారు రూ. 3 కోట్లు) ఆర్జించింది. 19వ స్థానంలో నిలిచిన‌ భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ పోస్ట్‌కూ 680,000 డాల‌ర్లు (సుమారు రూ. 5 కోట్లు) సంపాదించాడు. ఈ లిస్టులో ఫుట్‌బాల్ కింగ్ క్రిస్టియానో రోనాల్డో టాప్‌లో నిల‌వ‌గా, హాలీవుడ్ యాక్ట‌ర్ డ్వేన్ జాన్స‌న్ (ద రాక్‌) సెకండ్ ప్లేస్ ద‌క్కించుకున్నాడు. గ‌త ఏడాది ద రాక్ ఫ‌స్ట్ ప్లేస్‌లో నిల‌వ‌డం గ‌మ‌నించాలి.

హాప‌ర్ రిలీజ్ చేసిన గ‌త ఏడాది ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్‌లో 19వ స్థానం ద‌క్కించుకున్న ప్రియాంక ఇప్పుడు 27వ స్థానానికి ప‌డిపోయింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం న్యూయార్క్ న‌గ‌రంలో భ‌ర్త నిక్ జోనాస్‌తో స‌మ‌యం గ‌డుపుతున్న ప్రియాంక ఆదాయం ఏడాది కాలంగా చెప్పుకోద‌గ్గ రీతిలో పెరిగింది. లిస్ట్‌లో ఉన్న మిగ‌తా సెల‌బ్రిటీల ఆదాయం కూడా మ‌రింత పెర‌గ‌డం క‌నిపిస్తోంది. టాప్ 30 లిస్ట్‌లో చోటు చేసుకున్న ఇండియ‌న్ సెల‌బ్రిటీలు విరాట్‌, ప్రియాంక మాత్ర‌మే.

లిస్టులో విరాట్ కంటే ముందున్న స్పోర్ట్స్ సెల‌బ్రిటీలు.. క్రిస్టియానో రోనాల్డో (1), లియోనెల్ మెస్సీ (7), నేమార్ జూనియ‌ర్ (16). వీళ్లు ముగ్గురూ ఫుట్‌బాల్ ఆట‌గాళ్లే. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌తి స్పాన్స‌ర్డ్ పోస్ట్‌కు రోనాల్డో 1,604,000 (రూ. 11.9 కోట్లు) ఆర్జించ‌డం విశేషం. అత‌ని త‌ర్వాత స్థానాల్లో డ్వేన్ జాన్స‌న్‌, అరియానా గ్రండే, కైలీ జెన్న‌ర్‌. సెలెనా గోమెజ్ నిలిచారు.

నేటి కాలంలో అత్యంత బిజీగా ఉన్న ఇంట‌ర్నేష‌న‌ల్ సెల‌బ్రిటీల్లో ప్రియాంక ఒక‌రు. 'మాట్రిక్స్ 4', 'టెక్స్ట్ ఫ‌ర్ యు' సినిమాల షెడ్యూళ్ల‌ను పూర్తిచేసిన ఆమె, ఇప్పుడు 'సిటాడెల్' మూవీ షూటింగ్‌లో ఉంది. ఇండియ‌న్ వెడ్డింగ్ కామెడీ అయిన 'మిండీ కాలింగ్‌'లోనూ ఆమె క‌నిపించ‌నున్న‌ది. దీనికి నిర్మాత ఆమే.