English | Telugu

పూన‌మ్ పాండేను కొట్టిన భ‌ర్త అరెస్ట్‌.. హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయిన యాక్ట్రెస్‌!

మోడ‌ల్‌, న‌టి పూన‌మ్ పాండేను శారీర‌కంగా వేధించిన‌ భ‌ర్త శామ్ బాంబేను న‌వంబ‌ర్ 7న ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఎన్ఐ వార్తా సంస్థ ప్ర‌కారం, భ‌ర్త‌పై కంప్ల‌యింట్ చేసిన అనంత‌రం పూన‌మ్ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యింది. "త‌న‌ను కొట్టాడంటూ పూన‌మ్ పాండే కంప్ల‌యింట్ చేయ‌డంతో ముంబైలో నిన్న ఆమె భ‌ర్త శామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు. పూన‌మ్ ఒక హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు." అని ట్వీట్ చేసింది ఏఎన్ఐ.

పూన‌మ్ వైవాహిక జీవితం వార్త‌ల్లోకి ఎక్క‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ కాదు. త‌మ పెళ్ల‌యిన కొద్ది రోజుల‌కే గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో గోవాలో ఒక సినిమా షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్న‌ప్పుడు, భ‌ర్త‌పై గృహ‌హింస చ‌ట్టం కింద పోలీసుల‌కు ఫిర్యాదు చేసిందామె. త‌న భ‌ర్త వేధింపుల‌కు గురిచేశాడ‌నీ, త‌న‌పై కంప్ల‌యింట్ చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని బెదిరించాడ‌నీ ఆమె ఆరోపించింది. ఆ ఫిర్యాదుతో గోవా పోలీసులు శామ్‌పై ఐపీసీ సెక్ష‌న్లు 353, 506, 354 కింద కేసు న‌మోదు చేసి, అరెస్ట్ చేశారు.

అయితే ఆ కేసులో శామ్‌కు బెయిల్ వ‌చ్చాక‌, తిరిగి భ‌ర్త‌తో క‌లిసిపోయింది పూన‌మ్‌. "మేం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకున్నాం. నేను నా వివాహ బంధాన్ని కాపాడుకున్నాను. మీరు ఎవ‌రినైనా ల‌వ్ చేస్తే, అంత త్వ‌ర‌గా వ‌దిలేసుకుంటారా? ప్రాబ్లెమ్స్ వ‌స్తుంటాయ‌ని నేను ఒప్పుకుంటాను, కానీ ఒక చాన్స్ క‌చ్చితంగా ఇవ్వాలి." అని అప్పుడు చెప్పిందామె. ముంబైలోని త‌మ బాంద్రా నివాసంలో నిరాడంబ‌రంగా పెళ్లి చేసుకోవ‌డానికి ముందు.. పూన‌మ్‌, శామ్ రెండేళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేశారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.