Read more!

English | Telugu

ఎంత క‌ష్టం.. ఫ్రెండ్స్‌ని క‌ల‌వ‌కుండా త‌న రూమ్‌లోనే గ‌డుపుతున్న ఆర్య‌న్ ఖాన్‌!

 

కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేయ‌డంతో షారుక్ ఖాన్‌, ఆయ‌న ఫ్యామిలీకి గ‌త నెల అత్యంత సంక్లిష్ట కాల‌మ‌ని చెప్పాలి. అక్టోబ‌ర్ 28న బెయిల్ పొందేదాకా ఆర్య‌న్ 25 రోజుల పాటు క‌స్ట‌డీలో గ‌డిపాడు. కాగా, బెయిల్ ల‌భించి ఇంటికి వ‌చ్చాక ఆర్య‌న్ మాన‌సిక స్థితి గురించి, జైలు అనుభ‌వంతో అత‌ను పొందుతున్న వ్య‌ధ గురించీ అభిమానుల హృద‌యాలు త‌ల్ల‌డిల్లే విష‌యాల‌ను ఖాన్ ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్ ఒక‌రు బ‌య‌ట‌కు వెల్ల‌డించారు.

జైలు నుంచి ఆర్య‌న్ రిలీజ‌య్యాక‌, త‌మ నివాసం 'మ‌న్న‌త్' నుంచి ముంబై శివార్ల‌లో ఉన్న అలీబాగ్ ఫామ్‌హౌస్‌కు మ‌కాం మార్చింది షారుక్ ఫ్యామిలీ. మ‌న్న‌త్‌లో ఉంటే ఫ్యాన్స్‌తో పాటు ఫ్రెండ్స్‌, క్లోజ్ స‌ర్కిల్స్‌లోని వారు త‌ర‌చూ వ‌చ్చి ప‌ల‌క‌రిస్తుంటార‌నీ, ఇది ఆర్య‌న్‌ను డిస్ట‌ర్బ్ చేయ‌వ‌చ్చ‌నే ఉద్దేశంతోనే షారుక్ కొడుకును తీసుకొని ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయాడు.

జైలు నుంచి వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచీ ఆర్య‌న్ ఎవ‌రితోనూ ఎక్కువ‌గా మాట్లాడ‌టం లేద‌నీ, ఫ్రెండ్స్‌ను క‌ల‌వ‌డానికి బ‌య‌ట‌కు వెళ్ల‌డం లేద‌నీ, త‌న రూమ్‌లోనే ఎక్కువ‌గా గ‌డుపుతున్నాడ‌నీ షారుక్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక‌రు చెప్పారు. "మామూలుగానే అత‌ను ఎక్కువ‌గా మాట్లాడ‌డు. ఇప్పుడ‌స‌లు మాట్లాడ‌కుండా మౌనంగా ఉంటున్నాడు. ఫ్యామిలీ కూడా అత‌డిని డిస్ట‌ర్బ్ చేయ‌ట్లేదు. ఆర్య‌న్ త‌న‌దైన ప్ర‌పంచంలో ఉంటున్నాడు" అని ఆయన చెప్పారు.

ఆర్య‌న్ కోసం షారుక్ బాడీగార్డుల్ని ఏర్పాటుచేస్తున్నాడ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు. "ఆర్య‌న్ కోసం ప్ర‌త్యేకంగా బాడీగార్డుని పెట్టాల‌నే ఆలోచ‌న ఏదీ షారుక్‌కు లేదు. కొడుకు కోసం త‌న టైమ్‌నంతా ఆయ‌న కేటాయిస్తున్నాడు. త‌న షూటింగ్స్‌ను కూడా పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. కొడుక్కి ఎప్పుడు అవ‌స‌ర‌మైతే అప్పుడు అందుబాటులో ఉంటున్నాడు" అని ఆ ఫ్రెండ్ వెల్ల‌డించారు.

అక్టోబ‌ర్ 2న క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన ఎన్సీబీ బృందం ఆర్య‌న్ స‌హా మ‌రికొంత‌మందిని అదుపులోకి తీసుకుంది. ఆ మ‌రుస‌టి రోజు ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద అత‌డిని అరెస్ట్ చేసింది.