Read more!

English | Telugu

జిమ్ మూవీ గురించి హింట్ ఇచ్చిన ప‌ఠాన్ విల‌న్‌

ప‌ఠాన్ సినిమా ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రియేట్ చేస్తున్న రికార్డులు చూసి ఫిదా అవుతోంది బాలీవుడ్‌. షారుఖ్‌, దీపిక క‌లిసి న‌టించిన ప‌ఠాన్‌లో విల‌న్‌గా న‌టించారు జాన్ అబ్ర‌హామ్‌. దేశభ‌క్తుడిగా సైన్యంలో ప‌నిచేసిన జిమ్ దేశ‌ద్రోహిగా ఎలా మారాడు? అత‌డు అంత క‌ర్క‌శంగా మార‌డానికి కార‌ణం ఏంటి?  దేశం మీద అత‌నికి ఎందుకు అంత కోపం వంటి విష‌యాల‌తో య‌ష్ రాజ్ ఫిల్మ్స్ త‌ప్ప‌కుండా ఓ సినిమా  చేస్తుంద‌ని ఆశిస్తున్నాను అని అంటున్నారు జాన్ అబ్ర‌హామ్‌.

ప‌ఠాన్‌లో త‌న కేర‌క్ట‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని ముందే ఊహించాన‌ని, కానీ, ఈ స్థాయి ఆద‌ర‌ణ ఊహించ‌లేద‌ని అన్నారు.
షారుఖ్‌, జాన్ అబ్ర‌హామ్ మ‌ధ్య తెర‌కెక్కిన యాక్ష‌న్ సీక్వెన్స్ కి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. జాన్ అబ్ర‌హామ్ దీని గురించి మాట్లాడుతూ `` ప‌ఠాన్‌లో జిమ్‌గా న‌న్ను అభిమానిస్తున్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. నేనెప్పుడు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ కోరుకుంటాను. క‌లెక్ష‌న్లు, అవార్డులు అనేవి బోన‌స్‌లుగా భావిస్తాను. ప‌ఠాన్ హిస్టారిక‌ల్ స‌క్సెస్ అయింది. జిమ్ కేరక్ట‌ర్‌కి ప్రీవియ‌స్ ఏం జ‌రిగి ఉంటుందో తెలుసుకోవాల‌ని చాలా మంది అడుగుతున్నారు. త‌ప్ప‌కుండా య‌ష్ రాజ్ ఫిల్మ్స్ ఈ దిశ‌గా ఆలోచిస్తార‌ని ఆశిస్తున్నాను. ఎప్పుడైనా హీరో కేర‌క్ట‌ర్ గురించే ప్రేక్ష‌కులు ఆరా తీస్తారు. కానీ విల‌న్ కేర‌క్ట‌ర్ గురించి ఇంత‌గా ఆరా తీస్తూ మెసేజ్‌లు రావ‌డం నాకు ఇదే తొలిసారి. ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లో అంత‌గా గుర్తుండిపోయే విల‌న్ రోల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది `` అని అన్నారు.త‌న‌కు సిద్ధార్థ్ ఈ కేర‌క్ట‌ర్ గురించి చెప్పిన‌ప్పుడు కూడా త‌న‌కు న‌చ్చిన పాయింట్ ఇదేన‌ని అన్నారు. ప‌ఠాన్‌, క‌బీర్‌, జిమ్ కేర‌క్ట‌ర్లు ఈ యూనివ‌ర్శ్ లో ది బెస్ట్ అవుతాయి అని చెప్పారు.