English | Telugu
జవాన్ బడ్జెట్ పెంచిన అట్లీ... బాద్షా గుస్సా!
Updated : Feb 13, 2023
పఠాన్ సినిమా సక్సెస్‌ని షారుఖ్ అండ్ సిద్ధార్థ్ ఆనంద్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉంది. కానీ షారుఖ్ తో నెక్స్ట్ సినిమాలు తీస్తున్న డైరక్టర్ల మీద మాత్రం విపరీతమైన ప్రెజర్ క్రియేట్ అవుతోంది.షారుఖ్‌తో ప్రస్తుతం జవాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు అట్లీ. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తున్నారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. అయితే ముందు చెప్పినదానితో పోలిస్తే ఇప్పటికే దాదాపు 15 కోట్ల రూపాయలు బడ్జెట్‌ని పెంచేశారట అట్లీ. ఇంత ఖర్చు ఎందుకు అవుతుందనే విషయం మీద ప్రొడక్షన్ హౌస్ కూడా అట్లీని నిలదీసిందట.
ఈ టైమ్‌లో షారుఖ్ తన వైపు మాట్లాడుతారని అనుకున్నారట అట్లీ. పఠాన్‌ని మించిన లావిష్‌గా సినిమా తీయాలంటే ఆ మాత్రం ఖర్చు చేయడంలో తప్పు ఏమీ లేదన్నది అట్లీ వాదన. అయితే ఆ విషయాన్ని షారుఖ్ అర్థం చేసుకోకపోగా, అట్లీ మీద కోపం చూపించారట.అందుకే అక్కడ ఏం చేయాలో పాలుపోని అట్లీ నేరుగా చెన్నైలో ల్యాండ్ అయ్యారట. కావాలని వృథి ఖర్చు చేస్తే అడగాలి గానీ, ఉన్న డబ్బంతా స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు నిలదీయడంలో అర్థం ఏంటి? దాన్ని గమనించకుండా షారుఖ్ కూడా ప్రొడక్షన్ వాళ్ల వైపు మాట్లాడటం ఏంటి ? అంటూ సన్నిహితులతో అన్నారట అట్లీ.ఇప్పుడు అట్లీ పరిస్థితి ఇలా ఉంటే, డంకీ సినిమా చేస్తున్న రాజ్‌కుమార్ హిరాణీ పొజిషన్ ఏంటి? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు.