English | Telugu

ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామ‌న్న ఫ్యాన్‌... వ‌ద్ద‌ని వేడుకున్న షారుఖ్‌

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప‌ఠాన్ తెచ్చిన స‌క్సెస్‌తో క్లౌడ్‌నైన్‌లో ఉన్నారు షారుఖ్‌ఖాన్‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కును ట‌చ్ చేసిన ప‌ఠాన్‌, ఇండియాలో మాత్రం 500 కోట్ల నెట్‌ను రీచ్ అయింది. హ‌య్య‌స్ట్ గ్రాసింగ్ హిందీ సినిమాగా రికార్డులు సెట్ చేసింది. ఈ సినిమా ఇంత పెద్ద స‌క్సెస్ అయినా కూడా, షారుఖ్ ఎవ‌రికీ ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌లేదు. అయితే ట్విట్ట‌ర్‌లో మాత్రం త‌ర‌చూ ఫ్యాన్స్‌కి స‌మాధానాలు ఇస్తూనే ఉన్నారు. డైర‌క్ట్‌గా ఫ్యాన్స్ అడిగే ప్ర‌శ్న‌ల‌ను సెల‌క్ట్ చేసుకుని, వాటికి స‌ర‌దాగా జ‌వాబులు చెబుతున్నారు. ఆస్క్ ఎస్ఆర్‌కె అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయ‌న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తున్నారు.

లేటెస్ట్‌గా ఎస్ఆర్‌కె ఇచ్చిన ఓ స‌మాధానం నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అఖ్త‌ర్ ఖాన్ అనే వ్య‌క్తి షారుఖ్‌ని ఓ ప్ర‌శ్న అడిగారు. టాప్‌లెస్‌గా ఉన్న షారుఖ్ పిక్స్ కొన్నిటిని షేర్ చేస్తూ, మీకు 57 ఏళ్ల‌ని అబ‌ద్ధం చెప్పారు. ఇంత పెద్ద అబ‌ద్ధం ఆడి నేరం చేసినందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం మీ మీద అంటూ ఆ ఫొటోల‌కు క్యాప్ష‌న్ రాశారు అఖ్త‌ర్‌. దీనికి షారుఖ్ స్పందించారు. ``స‌రే స‌రే నాకు 30 ఏళ్ల‌ని ఒప్పుకుంటున్నా. ఇప్పుడు నేను మీకు నిజం చెప్పేశాను. అందుకే నా నెక్స్ట్ సినిమా జ‌వాన్‌`` అని రాసుకొచ్చారు. షారుఖ్‌ఖాన్ స‌మాధానం చూసిన నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఆయ‌న‌ స‌మ‌య‌స్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. ఇంకొక‌రైతే ఆ ప్ర‌శ్న‌కు మాత్ర‌మే సమాధానం చెప్పి ఊరుకునేవార‌ని, షారుఖ్ మాత్రం వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుని, త‌న నెక్స్ట్ సినిమాను కూడా ప్ర‌మోట్ చేసుకున్నార‌ని అంటున్నారు.

అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో షారుఖ్ న‌టిస్తున్న సినిమా జ‌వాన్‌. న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రియ‌మణి కూడా ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. తెలుగు నుంచి అల్లు అర్జున్ కీ రోల్ చేస్తార‌ని ఈ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. అయితే అఫిషియ‌ల్‌గా దీని గురించి ఇంకేం స‌మాచారం రాలేదు. ఆ మ‌ధ్య సేమ్ రోల్ కోసం విజ‌య్‌ని సంప్ర‌దించిన‌ట్టు కూడా న్యూస్ వ‌చ్చింది.జ‌వాన్ త‌ర్వాత రాజ్‌కుమార్ హిరాణీ డైర‌క్ష‌న్‌లో డంకీ సినిమాలో న‌టిస్తున్నారు షారుఖ్‌. ఇందులో తాప్సీ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.