Read more!

English | Telugu

'హీరామండి' స‌స్పెన్స్ రివీల్ చేసిన సంజ‌య్‌లీలా భ‌న్సాలీ!

వేశ్య‌లు రాణులైతే అనే కాన్సెప్ట్ త‌న‌ను ఎగ్జ‌యిట్ చేసింద‌ని, అందుకే వెంట‌నే హీరామండిని మొద‌లుపెట్టేశాన‌ని అన్నారు స్టార్ ఫిల్మ్ మేక‌ర్ సంజ‌య్‌లీలా భ‌న్సాలీ. ఆరుగురు అంద‌మైన మ‌హిళ‌ల‌తో నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సీరీస్ హీరామండి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు సంజ‌య్‌. పీరియాడిక్‌ డ్రామా ఇది. సోనాక్షి సిన్హా, మ‌నీషా కొయిరాలా, రిచా చ‌డ్డా, అదితిరావు హైద‌రీ, ష‌ర్మిన్ సెగ‌ల్‌, సంజీదా షేక్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఓటీటీ డెబ్యూ హీరామండీ గురించి సంజ‌య్ మాట్లాడుతూ ``నేను చాలా పెద్ద సినిమాలు చేశాను. అవ‌న్నీ నాకు నేచుర‌ల్‌గా వ‌చ్చాయి. హీరామండి వాట‌న్నిటినీ మించిన ప్రాజెక్ట్. చాలా పెద్ద స్కేల్‌తో తెర‌కెక్కిస్తున్నాం. దీని కోసం చాలా ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ్డాను. నా 30 ఏళ్ల కెరీర్‌లో 10 సినిమాలు చేశాను. లాస్ట్ ఇయ‌ర్‌లో మాత్రం మూడు చిత్రాలకు క‌ష్డ‌ప‌డినంత ప‌డి, ఈ ఎనిమిది ఎపిసోడ్లు చేశాను`` అని అన్నారు.

``నేను ఈ ప్రాజెక్ట్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను. అహ‌ర్నిశ‌లూ అల‌ర్ట్‌గా ఉన్నాను. స్క్రిప్ట్ ని ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఒక సినిమాకు ఎంత క‌ష్ట‌ప‌డతానో, అంత‌కు రెట్టింపు ప‌డ్డాను. నా బెస్ట్ ఇచ్చాను. షో చాలా బాగా వ‌చ్చింది. నాకు చాలా ప్ర‌త్యేక‌మైన ప్రాజెక్ట్ ఇది`` అని అన్నారు సంజ‌య్‌. దాదాపు 14 ఏళ్ల క్రితం నాటి ఐడియా ఇది. కానీ ఎప్ప‌టిక‌ప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌టంతో, ఈ ప్రాజెక్ట్ ని ప‌క్క‌న‌పెడుతూ వ‌చ్చారు. వేశ్యావృత్తిలో ఉన్నప్ప‌టికీ మ‌హారాణుల్లాగా జీవించిన వారికి సంబంధించిన క‌థ ఇది. బ‌డా న‌వాబులు, చ‌క్ర‌వ‌ర్తులు, బ్రిటిష‌ర్లు కూడా వాళ్ల పాద‌దాసులుగా ఉండేవారు. వేశ్య‌వృత్తిని చేప‌ట్టిన‌ప్ప‌టికీ, వారిలో గొప్ప ఆర్టిస్టులు, గాయ‌నీమ‌ణులు, నృత్య‌క‌ళాకారులు, క‌వయిత్రులు ఉండేవారు.

ఆ విష‌యాల‌ను పంచుకుంటూ ``వాళ్ల జీవితాల‌ను వారి వైపు నుంచి చెప్పే ప్ర‌య‌త్నం చేశాను. వారి భావోద్వేగాలు, వారి మ‌న‌సుల్లో నిక్షిప్త‌మైన వివ‌రాల గురించి ఇందులో మాట్లాడాను. రెండున్న‌రేళ్లు క‌ష్ట‌ప‌డి ఈ స్క్రిప్ట్ రాశాను. ఆడియ‌న్స్ ఏమ‌నుకుంటారోన‌నే ఆలోచ‌న‌ల‌తో స‌త‌మ‌త‌మ‌తం కాకుండా, ఫిల్మ్ మేక‌ర్‌గా నాకు సంతృప్తినిచ్చిన అంశాల‌తో, ఎగ్జ‌యిట్ చేసి విష‌యాల‌తో స్క్రిప్ట్ పూర్తి చేశాను`` అని అన్నారు మిస్ట‌ర్ భ‌న్సాలీ.