English | Telugu
రెండోసారి తల్లవుతున్న నేహా ధూపియా!
Updated : Jul 19, 2021
బాలీవుడ్ కపుల్ నేహా ధూపియా, అంగద్ బేడి తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించారు. 2018 నవంబర్ 18న వారికి మొదటి సంతానంగా మెహర్ పుట్టింది. రెండోసారి తల్లికాబోతున్న నేహ తన ప్రెగ్నెన్సీ మొదటి దశలో ఎదుర్కొన్న కష్టాల్ని చెప్పుకొచ్చింది.
రెండోసారి తల్లిదండ్రులవుతున్న విషయాన్ని ప్రకటించడానికి నేహ, అంగద్ ఓ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు. నేహ ఎత్తుగా ఉన్న తన పొట్టను చూపిస్తుంటే, అంగద్ చేతుల్లో ఉన్న వాళ్ల కూతురు మెహర్ ఆ పొట్ట వంక క్యూరియాసిటీతో చూస్తోంది. ఆ ఫొటోకు, "ఈ క్యాప్షన్ కోసం రెండు రోజుల సమయం పట్టింది. The best one we could think of was. థాంక్ యు గాడ్." అనే క్యాప్షన్ పెట్టింది నేహ. మరోవైపు అంగద్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో, "త్వరలో కొత్త హోమ్ ప్రొడక్షన్ రాబోతోంది. వాహేగురు మెహర్ కరే." అనే క్యాప్షన్ జోడించాడు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రెండో ప్రెగ్నెన్సీ సందర్భంగా ఎదుర్కొన్న ప్రాబ్లెమ్స్ గురించి వెల్లడించింది నేహ. తన ప్రెగ్నెన్సీ తొలి దశలో అంగద్‌కు కొవిడ్-19 సోకడం చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనేలా చేసిందని ఆమె చెప్పింది. అయితే తను పాజిటివ్ మైండ్‌తో ఉండేలా అంగద్ తనకు ధైర్యాన్నిస్తూ వచ్చాడని తెలిపింది నేహ.
సరిగ్గా 40 ఏళ్ల వయసులో (అంగద్ వయసు 38 ఏళ్లు) రెండోసారి తల్లి కానున్న నేహ ఈసారి చాలా పనులు చేయాలనుకుంటోంది. "రెండోసారి తల్లి కావడం భిన్నమైంది. ఇప్పుడు నా మనసులో ప్రశ్నలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎలా ఉంటుందో ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది కాబట్టి, నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలుసు. నా తొలి ప్రెగ్నెన్సీతో దీన్నెప్పుడూ పోల్చి చూసుకుంటున్నా. అయితే లాక్‌డౌన్ వల్ల ఇది అంత సునాయాసంగా లేదు." అని ఆమె చెప్పుకొచ్చింది. నేహ, అంగద్ కొంత కాలం డేటింగ్ తర్వాత 2018 మేలో వివాహం చేసుకున్నారు. అప్పటికే నేహ మూడు నెలల గర్భవతి!