English | Telugu
కాబూలీ వాలా కేరక్టర్‌లో మిథున్ అదుర్స్!
Updated : Aug 4, 2023
మిథున్ చక్రవర్తి ఇప్పుడు కాబూలీవాలాగా కనిపించనున్నారు. ఆయన గెటప్‌కి ఫిదా అవుతున్నారు బాలీవుడ్ జనాలు. జియో స్టూడియోస్, ఎస్‌వీఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ సినిమాను. లేటెస్ట్ గా ఈ సినిమాలోని మిథున్ చక్రవర్తి గెటప్‌ని విడుదల చేశాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కథ ఆధారంగా తెరకెక్కుతోంది కాబూలివాలా. రవీంద్రనాథ్ ఠాగూర్ మాస్టర్ పీస్‌లో మిథున్ చక్రవర్తి రహ్మత్‌గా నటిస్తున్నారు. జ్యోతి దేశ్‌పాండే, శ్రీకాంత్ మోహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. తన కూతురు మిని కోసం అల్లల్లాడే మిడిల్ ఏజ్డ్ ఆప్ఘన్ తండ్రి కథ ఇది. కోల్‌కతాలో 1965లో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రేమకు హద్దులుండవు. సరిహద్దులు అసలు ఉండవు. తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. మాటలకు అందలేనిది. ఇన్ని భావాలను తెరమీద పలికించాలంటే మిథున్ చక్రవర్తి కరెక్ట్ అనుకుని, సెలక్ట్ చేసుకున్నాం. ఆయన గెటప్ చాలా బావుంది. చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.
పాజిటివ్‌గా ఫీలవుతున్నాం అని అన్నారు నిర్మాతలు. మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ ``కాబూలివాలా సినిమాలో రెహమత్‌గా చేశాను. చాలా ఎమోషనల్ జర్నీ అది. మినితో అతనికున్న స్ట్రాంగ్ ఎమోషన్ అద్భుతంగా అనిపిస్తుంది. ఎంతో ఇష్టపడి చేశాను`` అని అన్నారు. దర్శకుడు సుమన్ ఘోష్ మాట్లాడుతూ ``బెంగాలీ కథను అడాప్ట్ చేసుకుని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్నాం. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. రెహమత్ కథ చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగాలకు లోనవుతారు`` అని అన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి షూటింగ్ మొదలుపెట్టారు. ఈ ఏడాది క్రిస్‌మస్‌కి విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్.
