Read more!

English | Telugu

జోరుమీదున్న మృణాల్ ఠాకూర్‌!

జోరుమీదున్నానంటూ ఓపెన్‌గా చెప్పేస్తున్నారు మృణాల్ ఠాకూర్‌. లాస్ట్ ఇయ‌ర్‌కి ముందు మృణాల్ అంటే ఎవ‌రో స్పెష‌ల్‌గా చెప్పాల్సి వ‌చ్చేదేమో. కానీ సీతారామం విడుద‌లైన త‌ర్వాత ఆమె గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. రీసెంట్‌గా ఉత్త‌రాదిన వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కం చేస్తున్నారు మృణాల్‌. బాలీవుడ్ న‌టుడు ఆదిత్య రాయ్ క‌పూర్‌తో ఆమె గుమ్రా అనే సినిమా చేస్తున్నారు. ఈ టీజ‌ర్ విడుద‌ల కానుంది.  ఈ విష‌యాన్ని ఆదిత్య రాయ్ క‌పూర్ రివీల్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకురానున్న‌ట్టు తెలిపారు. ఆదిత్య రాయ్ క‌పూర్‌, మృణాల్ జంట‌కు నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా గురించి వింటున్న ప్ర‌తిసారీ ఇంట్ర‌స్టింగ్‌గా అనిపిస్తుంది. 2023లో త‌ప్ప‌కుండా హిట్ అవుతారు అని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఆదిత్య‌రాయ్ క‌పూర్‌తో మృణాల్ న‌టిస్తున్న తొలి సినిమా గుమ్రా. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ. వ‌ర్ద‌న్ కేట్క‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. తమిళంలో సూప‌ర్‌డూప‌ర్ గా స‌క్సెస్ అయిన త‌డ‌మ్ సినిమాకు రీమేక్ ఇది. ఈ చిత్రంలో ఆదిత్య డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపిస్తారు. ఆయ‌న న‌టించిన నైట్ మేనేజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. త‌డ‌మ్ సినిమాను తెలుగులో రామ్ చేశారు. రెడ్ పేరుతో విడుద‌లైంది. ఈ సినిమాలో రామ్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించారు. అయితే తెలుగులో ఈ సినిమా పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. తెలుగులో ప్ర‌స్తుతం నానితో ఓ సినిమా చేస్తున్నారు మృణాల్‌. నాని న‌టించిన ద‌స‌రా ఈ స‌మ్మ‌ర్‌కి విడుద‌ల కానుంది. అంటే ఏప్రిల్‌లో అటు నాని సినిమా, ఇటు మృణాల్ సినిమా జ‌నాల ముందుకు రానున్నాయి. ఎవ‌రు నెగ్గుతారో, ఎవ‌రు త‌గ్గుతారోన‌న్న‌ది ఇంట్ర‌స్టింగ్ విష‌యం అంటున్నారు వారితో ప‌నిచేసే యూనిట్ మెంబ‌ర్స్.