English | Telugu

అలాంటిది రెండు ద‌శాబ్దాల‌కు ఒక‌సారే జ‌రుగుతుంద‌న్న షాహిద్‌ 

బాలీవుడ్ అర్జున్‌రెడ్డి షాహిద్‌ క‌పూర్‌. మ‌న‌కు బాలీవుడ్ హీరోల‌తో చాలా మందితో అనుబంధం ఉన్న‌ప్ప‌టికీ, షాహిద్ మీద ఎప్పుడూ స్పెష‌ల్ కాన్‌సెన్‌ట్రేష‌న్ ఉంటుంది. ఆయ‌న కూడా సౌత్ సినిమాల మీద‌, స‌బ్జెక్టుల మీద ఓ న‌జ‌ర్ వేసి ఉంటారు. ఆయ‌న న‌టించిన జ‌బ్ వి మెట్ విడుద‌లై 15 ఏళ్లు పూర్త‌య్యాయి. గీత్‌, ఆదిత్య ప్రేమ‌క‌థ అప్ప‌ట్లో బాలీవుడ్ జ‌నాల‌కు తెగ న‌చ్చింది. ఈ సినిమాలో షాహిద్‌, క‌రీనా క‌లిసి న‌టించారు. ఇంతియాజ్ అలీ తెర‌కెక్కించారు. ఇటీవ‌ల వేలంటైన్స్ డేకి కూడా ఈ సినిమా రీ రిలీజ్ అయింది. ఆ సినిమాకు థియేట‌ర్ల‌లో వ‌చ్చిన స్పంద‌న చూసి మురిసిపోయారు షాహిద్‌.

ఈ సినిమా గురించి షాహిద్ మాట్లాడుతూ ``ఇటీవ‌ల జ‌బ్ వి మెట్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి చాలా మంది నాతో ఇలాంటి సినిమా మ‌ళ్ళీ ఎప్పుడు చేస్తార‌ని అడుగుతున్నారు. నా దృష్టిలో అలాంటి సినిమాలు రెండు ద‌శాబ్దాల‌కు ఒక‌సారి వ‌స్తాయి. ప్ర‌తి వారం వ‌చ్చే సినిమా లాంటిది కాదు ఆ సినిమా. దానికంటూ చాలా ప్ర‌త్యేక‌త‌లున్నాయి. డీసెంట్ స్క్రిప్ట్ క‌చ్చితంగా కావాలి. ఇంతియాజ్‌తో ఆ మ‌ధ్య మాట్లాడుతున్న‌ప్పుడు కూడా దీని ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఏదైనా ఫ‌న్‌గా, ఎగ్జ‌యిటింగ్‌గా ఉండే స్క్రిప్టులో చేయాల‌ని నాకూ ఉంది`` అని అన్నారు.

2007లో విడుద‌లైంది జ‌బ్ వి మెట్‌. ఫిల్మ్ ఫేర్‌లో బెస్ట్ యాక్ట‌ర్‌గా షాహిద్ నామినేట్ అయ్యారు. బెస్ట్ యాక్ట్రెస్‌గా అప్ప‌ట్లో క‌రీనా ట్రోఫీ అందుకున్నారు.ఇటీవ‌ల షాహిద్ న‌టించిన ఫ‌ర్జికి ఓటీటీలో మంచి స్పంద‌న వ‌స్తోంది. రాజ్‌, డీకే తెర‌కెక్కించిన వెబ్‌సీరీస్ ఇది. దక్షిణాది నుంచి విజ‌య్ సేతుప‌తి, రాశీఖ‌న్నా, రెజీనా కెసండ్రా న‌టించారు.ప్ర‌స్తుతం ఓ కామెడీ సినిమా చేసే ప‌నుల్లో ఉన్నారు షాహిద్‌. అనీజ్ బాజ్మీతో ఈ స్క్రిప్ట్ గురించి డిస్క‌ష‌న్ చేస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫ‌ర్ సినిమా బ్ల‌డీ డాడీలోనూ న‌టిస్తున్నారు షాహిద్‌.