English | Telugu

త‌ల్లిదండ్రుల్ని ద‌త్త‌త తీసుకోనున్న కృతి స‌న‌న్!

`1 నేనొక్క‌డినే` బ్యూటీ కృతి స‌న‌న్.. త‌ల్లిదండ్రుల్ని ద‌త్త‌త తీసుకోబోతోంద‌ట‌. అయితే.. ఇదేదో రియ‌ల్ లైఫ్ లో అనుకునేరు! కానే కాదు.. ఓ హిందీ చిత్రం కోసం రీల్ లైఫ్ లో ఈ ఆద‌ర్శ‌వంత‌మైన కార్యం చేయ‌బోతోంది కృతి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట‌ర్ రాజ్ కుమార్ రావ్ తో క‌లిసి కృతి ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తోంది. ఆ చిత్ర‌మే.. `హ‌మ్ దో హ‌మారే దో`. ఇందులో త‌ల్లిదండ్రుల్ని ద‌త్త‌త తీసుకోవాల‌నుకునే జంట‌గా రాజ్, కృతి క‌నిపించ‌బోతున్నారు. చ‌క్క‌టి సందేశానికి వినోదాన్ని మేళ‌వించి రూపొందిస్తున్న ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో వృద్ధ దంప‌తులుగా ప‌రేశ్ రావెల్, ర‌త్నా పాఠ‌క్ షా క‌నిపించ‌నున్నారు. ఇటీవ‌లే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన `మిమి`లో స‌రోగేట్ మ‌ద‌ర్ గా కెరీర్ బెస్ట్ ఫెర్మార్పెన్స్ తో అల‌రించిన కృతి.. ఈ సినిమాతో అంత‌కుమించి గుర్తింపు తెచ్చుకుంటానన్న ధీమాతో ఉంది. మ‌రి.. కృతి న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

కాగా, ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్`లో న‌టిస్తోంది కృతి. ఇందులో సీత‌గా ఆమె ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. 2022 ఆగ‌స్టు 11న `ఆదిపురుష్` థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.