English | Telugu

అత్తగారింట్లో 'కత్రినా' వండిన తొలి వంటకం ఏంటో తెలుసా?

బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 9న రాజస్థాన్‌ లోని సవాయ్ మాధోపూర్‌ లో పంజాబీ స్టైల్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం అత్తగారింట్లో అడుగు పెట్టిన కత్రినా.. తొలిసారి తాను వండిన వంటకం ఏమిటో తాజాగా చెప్పేసింది.

వివాహం అనంతరం అత్తగారింట్లో అడుగుపెట్టిన వధువు తొలిసారిగా తన చేత్తో ఏదైనా తీపి వంటకం చేసే సాంప్రదాయం ఉంది. పంజాబీ కోడలిగా అడుగుపెట్టిన కత్రినా కూడా ఈ ఆచారాన్ని పాటించింది. అత్తగారింట్లో కత్రినా తొలిసారిగా తన చేత్తో హల్వా వండింది. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కత్రినా.. తానే చేసానని చెప్పుకొచ్చింది. ఇక కత్రినా వంటకి విక్కీ ఫిదా అయిపోయాడు. ఇప్పటివరకు నేను తిన్న బెస్ట్ హల్వా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశాడు.

కత్రినా అత్తగారింట్లో వండిన హల్వా స్వీట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్‌ హీరోయిన్‌ అయినా ఆచారాలను పాటిస్తుంది అంటూ క​త్రినాపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.