Read more!

English | Telugu

'కేజీఎఫ్' త‌ర‌హాలో 'పుష్ప' హిందీ వెర్ష‌న్ ఓపెనింగ్స్ రూ. 2 కోట్లు దాట‌తాయా?

 

స‌రిగ్గా మూడేళ్ల క్రితం షారుక్ ఖాన్ మూవీ 'జీరో'పై య‌శ్ హీరోగా న‌టించిన 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 1' హిందీ వెర్ష‌న్ రిలీజ‌య్యింది. ఒక క‌న్న‌డ మూవీ హిందీలో మంచి మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న‌ల్ స‌పోర్ట్‌తో విడుద‌ల‌వ‌డం అదే మొద‌టిసారి. ఫ‌స్ట్ డే ఆ సినిమా రూ. 2.10 కోట్ల‌ను వ‌సూలు చేసింది. 50 రోజుల పాటు ఆడిన 'కేజీఎఫ్' హిందీ వెర్ష‌న్ రూ. 43.93 కోట్ల‌ను రాబ‌ట్ట‌డం పెద్ద విశేషంగా ట్రేడ్ వ‌ర్గాలు చెప్పుకున్నాయి. 

Also read: 'పుష్ప' 5వ షోకు అనుమ‌తినిచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

ఇప్పుడు అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' మూవీ హిందీ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 'కేజీఎఫ్' ఎలా ఆడిందో 'పుష్ప' కూడా అలా ఆడుతుంద‌నే న‌మ్మ‌కాన్ని ఫ్యాన్స్ వ్య‌క్తం చేస్తున్నారు. నిజానికి 'పుష్ప' పాన్ ఇండియా మూవీగా రిలీజ‌వుతోంది. పైగా, 'అల.. వైకుంఠ‌పుర‌ములో' బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌వ‌డం, ఆ సినిమాలోని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్‌లో పాపుల‌ర్ కావ‌డంతో అందుక‌నుగుణంగా అల్లు అర్జున్ పాపులారిటీ కూడా పెరిగింది. ఆ మూవీ హిందీలో కార్తీక్ ఆర్య‌న్ హీరోగా 'షెహ్‌జాదా' టైటిల్‌తో రీమేడ్ అయ్యింది. ఆశ్చ‌ర్య‌క‌రంగా స‌రైన ప్ర‌మోష‌న్ లేకుండా, 'స్పైడ‌ర్‌మ్యాన్: నో వే హోమ్‌'పై 'పుష్ప' విడుద‌ల‌వుతోంది. 

Also read: స‌మంత‌ సాంగ్ కాంట్ర‌వ‌ర్సీపై రెస్పాండ్ అయిన అల్లు అర్జున్‌!

ఫ‌స్ట్ డే 'పుష్ప' హిందీ వెర్ష‌న్ ఎదుర్కొంటున్న మొద‌టి ఛాలెంజ్‌.. మొద‌టి రోజు (డిసెంబ‌ర్ 17) రూ. 1 కోటి మార్కును దాటడం. ఒక‌వేళ అది రూ. 2 కోట్ల‌ను దాటితే, బాగా వ‌సూలు చేసిన‌ట్లు లెక్క‌. ఆ త‌ర్వాత మౌత్ టాక్ మీద దాని వ‌సూళ్లు ఆధార‌ప‌డ‌నున్నాయి. ఏం జ‌రుగుతుందో చూడాలి.