Read more!

English | Telugu

పెళ్లికి ముందే ఖ‌రీదైన ఫ్లాట్ అద్దెకు తీసుకున్న‌ క‌త్రినా-విక్కీ జంట‌! డిసెంబ‌ర్‌లో కాపురం!!

 

కొన్ని వారాలుగా మీడియాలో, సోష‌ల్ మీడియాలో బాలీవుడ్ న‌టులు క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ పెళ్లి గురించిన వార్త‌లు హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. ఇంత‌దాకా ఆ ఇద్ద‌రిలో ఎవ‌రూ బాహాటంగా త‌మ పెళ్లి గురించి మాట్లాడ‌క‌పోయినా, డిసెంబ‌ర్ ప్ర‌థ‌మార్ధంలో వారి పెళ్లి ఖాయ‌మ‌ని, ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు మొద‌ల‌య్యాయ‌నీ బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కాగా ముంబైలో సంప‌న్న వ‌ర్గాలు నివ‌సించే జుహు ప్రాంతంలో ఓ ఫ్లాట్‌ను క‌త్రినా, విక్కీ సెల‌క్ట్ చేసుకున్నార‌నీ, పెళ్ల‌య్యాక డిసెంబ‌ర్‌లోనే అక్క‌డ కాపురం పెడ‌తార‌నీ తెలుస్తోంది. 

జుహులోని ఒక అపార్ట్‌మెంట్‌లో 8వ అంత‌స్తులో ఉన్న ఫ్లాట్‌ను వారు బుక్ చేసుకున్నార‌ని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్ర‌స్తుతం ఆ ఫ్లాట్‌లో డెక‌రేష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఆ వ‌ర్క్ ఎలా జ‌రుగుతోందూ చూడ్డానికి త‌ర‌చూ విక్కీ-క‌త్రినా క‌లిసి కానీ, విడివిడిగా కానీ వ‌చ్చిపోతున్నారు.

విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ నివాసం ఉంటున్న చోటే ఆ అపార్ట్‌మెంట్ ఉంది. గ‌త ఆగ‌స్ట్‌లో క‌త్రినా, విక్కీ అక్క‌డ‌కు వ‌చ్చార‌ని పింక్‌విల్లా పోర్ట‌ల్ కొద్ది రోజుల క్రితం తెలిపింది. ఆ త‌ర్వాత కొన్నిసార్లు అక్క‌డ‌కు వ‌స్తూ పోతూ వున్న వాళ్లు ఆ ఫ్లాట్ య‌జ‌మానుల‌తో డీల్‌ను ఫైన‌లైజ్ చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత ఆ ఇద్ద‌రూ ఇక్క‌డే కాపురం పెట్ట‌నున్నార‌ని ఆ పోర్ట‌ల్ రాసింది.

కాగా ఐదేళ్ల కాలానికి ఆ అపార్ట్‌మెంట్‌ను విక్కీ రెంట్‌కు తీసుకున్నాడ‌ని వ‌రుణ్ సింగ్ అనే రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ తెలిపాడు. జూలైలోనే కొంత అమౌంట్‌ను డిపాజిట్‌గా చెల్లించాడ‌ని అత‌ను వెల్ల‌డించాడు. "జుహులోని రాజ్‌మ‌హ‌ల్ ప్రాంతంలో విక్కీ ఒక ఫ్లాట్‌ను 60 నెల‌ల కాలానికి రెంట్‌కు తీసుకున్నాడు. సెక్యూరిటీ డిపాజిట్ కింద 1.75 కోట్ల రూపాయ‌లు చెల్లించాడు. మొద‌టి 36 నెల‌ల కాలంలో నెల‌కు 8 ల‌క్ష‌లు, త‌ర్వాత 12 నెల‌ల కాలానికి నెల‌కు 8.4 ల‌క్ష‌లు, చివ‌రి 12 నెల‌ల కాలానికి నెల‌కు 8.82 ల‌క్ష‌ల‌ను రెంట్ చెల్లించ‌నున్నాడు." అని వ‌రుణ్ సింగ్ వివ‌రించాడు.

రాజ‌స్థాన్‌లోని సావై మ‌ధోపూర్ న‌గ‌రంలో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బ‌ర్వారా అనే రిసార్ట్‌లో క‌త్రినా, విక్కీ పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ది.