English | Telugu

ఖాన్ త్ర‌యం బాలీవుడ్ గ్రేటెస్ట్ యాక్ట‌ర్స్‌.. ఇది స‌న్నీ లియోన్ లెక్క‌!

బాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో న‌టించిన ఒక‌ప్ప‌టి పోర్న్ స్టార్ స‌న్నీ లియోన్‌.. శృంగార తార‌గానే పాపుల‌ర్ అయ్యింది. 2011లో బిగ్ బాస్ సీజ‌న్ 5 (హిందీ) ద్వారా ఇండియాలో ఆమెవ‌రో అంద‌రికీ తెలిసింది. ఆ త‌ర్వాత 2012లో వ‌చ్చిన 'జిస్మ్ 2' మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది స‌న్నీ. అనంత‌రం తెలుగు స‌హా ప‌లు ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ న‌టించిందామె. ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా షో ప‌లు సీజ‌న్ల‌కు హోస్ట్‌గానూ ఆమె వ్య‌వ‌హ‌రించింది.

ఒక ఎంట‌ర్‌టైన్‌మెంట్ పోర్ట‌ల్‌కు లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంట‌ర్వూలో త‌న దృష్టిలో బాలీవుడ్ గ్రేటెస్ట్ యాక్ట‌ర్స్ ఎవ‌రో వెల్ల‌డించింది. "నా దృష్టిలో ముగ్గురున్నారు. ఆ ముగ్గురూ ఒకే స్థాయి క‌లిగిన‌వాళ్లు.. ఆమిర్ ఖాన్‌, షారుక్ ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్" అని ఆమె చెప్పింది. బాలీవుడ్ గురించి ఒక్క‌మాట‌లో చెప్ప‌మంటే, "వండ‌ర్‌ఫుల్" అని జ‌వాబిచ్చింది.

వ‌ర్క్ విష‌యానికి వ‌స్తే ఆమె న‌టించిన ప‌లు సినిమాలు వ‌రుస‌గా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వాటిలో షేరో, ప‌ట్ట‌, వీర‌మ‌హాదేవి, రంగీలా, ఓ మై ఘోస్ట్ ఉన్నాయి. అలాగే 'అనామిక' అనే వెబ్ సిరీస్ కూడా ఆమె చేస్తోంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.