English | Telugu
షారుఖ్ గురించి చెప్పిన రాఘవేంద్రరావు మాజీ కోడలు!
Updated : Jul 30, 2023
రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా ధిల్లాన్ ఇప్పుడు నార్త్‌లో రైటర్స్‌లో ఉత్తమ స్థానాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు డంకీకి పనిచేయడం తన ఇంటికి తిరిగి వచ్చినంత ఆనందంగా ఉందని అన్నారు. 16 ఏళ్ల క్రితం తన బాలీవుడ్ జర్నీని షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రారంభించారు. అసిస్టెంట్ డైరక్టర్‌గా, స్క్రిప్ట్ సూపర్‌వైజర్‌గా పనిచేశారు.
డంకీకి పనిచేయడం గురించి కనికా ధిల్లాన్ మాట్లాడుతూ "నేను షారుఖ్‌కి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో కలిసి మళ్లీ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో మళ్లీ మళ్లీ పనిచేయాలన్నది నా కల. అది నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది" అని అన్నారు థిల్లాన్. రాజ్‌కుమార్ హిరానీ, అభిజత్ జోషితో కలిసి డంకీకి పనిచేశారు ధిల్లాన్.
2007లో ఓం శాంతి ఓమ్ సినిమాకు స్క్రీన్‌ప్లే, 2011లో రావన్‌కి డైలాగులు అందించారు కనికా. ఆ తర్వాత ఆమె కథ పిక్చర్స్ పతాకంపై సినిమాలు తీసి నిర్మాతగా మారారు. "షారుఖ్ నాకు బెస్ట్ మెంటర్. నాకు చాలా విషయాలు నేర్పించారు. ఇవాళ నాకు తెలిసిన స్టోరీ టెల్లింగ్ గురించి, బాలీవుడ్ గురించి నాకు చాలా చాలా విషయాలను చెప్పింది షారుఖ్. నేను ఎంతో మంది నిర్మాతలతో పనిచేశాను. కానీ, షారుఖ్‌లాంటి వ్యక్తి నాకు తారసపడలేదు. మనిషిగా పరిపక్వత చెందడానికి ఆయన సలహాలు చాలా ఉపయోగపడుతాయి" అని అన్నారు.
ప్రస్తుతం ధిల్లాన్ దో పత్తితో బిజీగా ఉన్నారు.ఇందులో కాజోల్, కృతిసనన్ నటిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ థ్రిల్లర్. హసీనా దిల్‌రుబా సీక్వెల్ ఫిర్ ఆయి హసీనా దిల్‌రుబాకి కూడా పనిచేస్తున్నారు కనికా.