English | Telugu
షారుఖ్‌కి ఉన్న హిందూ పేర్లేంటో తెలుసా?
Updated : Jul 28, 2023
షారుఖ్‌ఖాన్ ఆయన సతీమణి గౌరీ ప్రేమ వివాహం చేసుకున్నారన్న సంగతి చాలా మందికి తెలుసు. 1991 అక్టోబర్‌లో వీరి వివాహం జరిగింది. ఇప్పుడు వారికి ముగ్గురు పిల్లలు. ఆర్యన్, సుహానా, అబ్రామ్ ఖాన్. నాలుగేళ్ల తర్వాత పఠాన్ సినిమా ఇచ్చిన హిట్ జోష్‌లో ఉన్నారు షారుఖ్. ఆయన గురించి రిలీజ్ అయిన ఓ పుస్తకంలో ఆయన తన మనసులోని మాటలను పంచుకున్నారు. తాను, గౌరీ పెళ్లి చేసుకోవడానికి పెద్దలను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట. గౌరీ తల్లికి, షారుఖ్ ని పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదట. ఒకానొక సందర్భంగా షారుఖ్‌ని గౌరీ, తన ఫ్యామిలీకి అభినవ్ అనే పేరుతో పరిచయం చేసిందట. అయినా విషయం బయటపడిందట. తర్వాత ఎప్పటికో ఒప్పుకుని పెళ్లి చేశారు.
గౌరీని హిందూ వివాహం చేసుకోవడం కోసం షారుఖ్ తన పేరును జితేంద్రకుమార్ తుల్లిగా మార్చుకున్నారట. తనకన్నా ముందు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న జితేంద్ర, రాజేంద్రకుమార్ తుల్లి పేర్లకు గుర్తుగా ఆయన అలా పేర్లు మార్చుకున్నారట. షారుఖ్‌ని ముస్లిం వివాహం చేసుకోవడం కోసం గౌరీ కూడా తన పేరును మార్చుకున్నారట. ఆయేషా అనే పేరుతో ఆమె షారుఖ్‌ని వివాహం చేసుకున్నారట.
రెండు మతాల ప్రకారం ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ, మళ్లీ రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నారట. తమ పెళ్లి గురించి ఎవరికీ ఎప్పుడూ చాలా విషయాలు చెప్పలేదని, ఇలా రివీల్ చేయడం ఇంట్రస్టింగ్‌గా ఉందని కూడా షారుఖ్ ఆ పుస్తకంలో చెప్పారు.