English | Telugu
జాన్వికి చేదు అనుభవం
Updated : Mar 13, 2021
`అతిలోక సుందరి శ్రీదేవి తనయ` అనే ట్యాగ్ తో బాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తొలి చిత్రం `ధడక్`తో నటిగా మంచి మార్కులు సంపాదించడమే కాకుండా.. కమర్షియల్ గానూ ఫస్ట్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన రెండో సినిమా `గుంజన్ సక్సేనా` కరోనా ఎఫెక్ట్ తో నెట్ ఫ్లిక్స్ లో రిలీజై.. విమర్శకుల ప్రశంసలు పొందింది. జాన్వి నటిగా ఎంతో ఇంప్రూవ్ అయిందనే మాటలు వినిపించాయి. ఇక `గుంజన్ సక్సేనా`కి ముందు వచ్చిన నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ `ఘోస్ట్ స్టోరీస్`తోనూ ఫర్లేదనిపించుకుంది జాన్వి.
అయితే, ఎటొచ్చి ఆమె తాజా చిత్రం `రూహీ`నే తేడా కొట్టింది. మార్చి 11న విడుదలైన ఈ హారర్ కామెడీ డ్రామా.. అటు కమర్షియల్ గా ఇంప్రెస్ చేయలేకపోయింది. అలాగే నటిగా జాన్వికి ఒరిగిందేమీ లేదనే విమర్శలు వచ్చాయి. రాజ్ కుమార్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ కూడా ఈ సినిమాని నిలబెట్టలేకపోవడం గమనార్హం. మొత్తమ్మీద.. `రూహి` చిత్రం జాన్వికి ఓ చేదు అనుభవమనే చెప్పాలి.మరి.. `దోస్తానా 2`, `గుడ్ లక్ జెర్రీ` చిత్రాలతోనైనా జాన్వీ కపూర్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.