Read more!

English | Telugu

వ‌ర్థ‌మాన న‌టుడి ప్రేమ‌లో హృతిక్ మాజీ భార్య‌?

 

హృతిక్ రోష‌న్‌, సుసానే ఖాన్ చిన్న‌నాటి స్నేహితులు. పెద్ద‌య్యాక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప‌ద్నాలుగేళ్ల వైవాహిక జీవితం త‌ర్వాత త‌మ మ‌ధ్య రొమాంటిక్ యాంగిల్‌కు స్వ‌స్తి చెప్పేసి, 2014లో విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయిన వార్త బాలీవుడ్‌నే కాకుండా ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని షేక్ చేసింది. అయితే విడాకుల త‌ర్వాత కూడా ఫ్రెండ్స్‌గా కొన‌సాగ‌డం వారి ప్ర‌త్యేక‌త‌. త‌మ ఇద్ద‌రు కొడుకుల‌ను జంట‌గానే చూసుకుంటూ వ‌స్తున్నారు. పిల్ల‌ల విష‌యంలోనే కాకుండా ఒక‌రికొక‌రు స‌పోర్ట్‌గా కూడా ఉంటున్నారు. కంగ‌నా ర‌నౌత్‌-హృతిక్ మొత్తం ఎపిసోడ్‌లో మాజీ భ‌ర్త‌కు పూర్తి స‌పోర్ట్‌ను ఇచ్చింది సుసానే.

అయితే ఇన్నాళ్ల‌కు సుసానే త‌న జీవితంలో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం న‌టుడు అలీ గోని సోద‌రుడు అర్‌స్లాన్ గోనితో ఆమె ప్రేమ‌లో ప‌డింది. 'జియా ఔర్ జియా' మూవీలో న‌టించిన అర్‌స్లాన్‌తో సుసానే స‌న్నిహితంగా మెల‌గుతోంద‌ని చెప్పుకుంటున్నారు.

"ఆరు నెల‌లుగా వారు ఒక‌రినొక‌రు తెలుసుకుంటున్నారు. టీవీ ఇండ‌స్ట్రీకి చెందిన కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా వారు తొలిసారి క‌లుసుకున్నారు. అయితే ఇటీవ‌ల వారు ప‌ర‌స్ప‌రం స‌న్నిహితుల‌య్యారు." అని సుసానే స‌న్నిహితులు తెలిపారు. "వారి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే వారు కేవ‌లం ఫ్రెండ్స్ కాద‌నీ, అంత‌కంటే ఎక్కువ అనుబంధం వారి మ‌ధ్య ఏర్ప‌డింద‌నీ తెలుస్తోంది. కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా ఆ ఇద్ద‌రూ త‌ర‌చూ క‌లుసుకుంటున్నారు." అని కూడా వారు చెప్పారు.

ఏక్తా క‌పూర్ గ్యాంగ్‌తో క‌లిసి ఇటీవ‌ల సుసానే ఖాన్ విహార యాత్ర‌కు వెళ్ల‌డానికి కార‌ణం ఏమిటో అంద‌రికీ అర్థ‌మైంది. అయితే త‌మ బంధంపై ఇటు సుసానే కానీ, అటు అర్‌స్లాన్ గోని కానీ పెద‌వి విప్ప‌లేదు.

వ‌ర్క్ విష‌యానికి వ‌స్తే, లేటెస్ట్‌గా 'మై హీరో బోల్ ర‌హా హూ' అనే వెబ్ సిరీస్‌లో నెగ‌టివ్ క్యారెక్ట‌ర్ పోషించ‌డానికి సంత‌కం చేశాడు అర్‌స్లాన్‌. ఆ సిరీస్‌ను ఏక్తా క‌పూర్‌కు చెందిన ఆల్ట్ బాలాజీ సంస్థ నిర్మిస్తోంది.