English | Telugu
పేరులో ఎక్స్ ట్రా 'ఇ' కలిపిన జాక్వలిన్ ఫెర్నాండెజ్!
Updated : Jun 18, 2023
బాలీవుడ్ సెలబ్రిటీలు తమ పేరులో అప్పుడప్పుడు స్పెల్లింగ్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అయితే అది కెరీర్ స్టార్టింగ్లోనో, లేకుంటే హిట్లు లేనప్పుడో చేస్తారు. కానీ అన్నీ కుదిరిన ఈ సమయంలో జాక్వలిన్ ఫెర్నాండెజ్ తన పేరులో ఇ అనే అక్షరాన్ని కలిపారు. రేస్3 యాక్ట్రెస్ ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు అలా చేశారనే టాపిక్ డిస్కషన్లో ఉంది.
ఇప్పుడు జాక్వలిన్ ఫెర్నాండెజ్ న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకున్నట్టున్నారు. ఇటీవల ఆమె జీవితంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి. వాటన్నిటికీ దూరంగా ఉండటం కోసమే ఆమె పేరును ఇలా మార్చుకున్నారేమో అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మరికొందరు నెటిజన్లు పోస్ట్ చేసిన విషయాలు నవ్వు తెప్పిస్తున్నాయి. "నేను ఇంతకు ముందు కూడా ఆమె పేరుకు స్పెల్లింగ్ చెప్పలేకపోయేవాడిని. ఇప్పుడు మళ్లీ ఇంకో ఇ యాడ్ చేశారని తెలిసింది. ఇక అసలు ట్రై చేయను" అని అన్నారు. ఉన్నట్టుండి న్యూమరాలజీ వైపు ఆమె అడుగులు ఎందుకు పడ్డాయంటూ మరికొందరు ఆరా తీస్తున్నారు.
జాక్వలిన్ ప్రస్తుతం క్రాక్, ఫతేహ్లో నటిస్తున్నారు. ఆమె నటించిన రామ్ సేతు, సర్కస్ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాకపోవడంతో, ఇర్రిటేటింగ్గా ఉన్నారట జాక్వలిన్. క్రాక్‌లో ఆమెతో పాటు విద్యుత్ జమ్వాల్, అర్జున్ రామ్‌పాల్ నటిస్తున్నారు. ఆదిత్య దత్ డైరక్ట్ చేస్తున్నారు. విద్యుత్ జమ్వాల్, పరాగ్ సాంఘ్వి యాక్షన్ హీరో ఫిల్మ్స్ అండ్ పీజెడ్ పిక్చర్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. ఫతేహ్ని వైభవ్ మిశ్రా డైరక్ట్ చేస్తున్నారు. సోనూ సూద్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా సైబర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది.