English | Telugu

సల్మాన్ ఖాన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన సమంత!

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, అమెరికా నటి సమంత లాక్ వుడ్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా సమంత స్పందించింది. సల్మాన్ తో తనకు పరిచయం ఉందని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదంటూ ఆమె వార్తలను కొట్టిపారేసింది.

సల్మాన్ ఖాన్, సమంత లాక్ వుడ్ మధ్య ఎఫైర్ అంటూ వార్తలొచ్చాయి. ఇటీవల జరిగిన సల్మాన్ జన్మదిన వేడుకల్లో ఆమె పాల్గొనడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. గతంలో ఎందరో బాలీవుడ్ హీరోయిన్స్ తో డేటింగ్ చేసిన సీనియర్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ఇప్పుడు అమెరికా నటితో డేటింగ్ లో ఉన్నదంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని సమంత ఖండించింది.

సల్మాన్ కి, తనకి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని సమంత తెలిపింది. "సల్మాన్ తో చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. ఆయన మంచి వ్యక్తి. సల్మాన్ బర్త్ డే పార్టీకి వచ్చిన అతిథుల్లో నేను ఒకరిని. నేను హృతిక్ రోషన్ ను కూడా కలుసుకున్నాను. కానీ, నా గురించి, హృతిక్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఈ వార్తలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడం లేదు." అంటూ సమంత క్లారిటీ ఇచ్చింది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.