English | Telugu
డిప్రెషన్‌తో 20 కిలోల బరువు పెరిగిన సూపర్‌స్టార్ కుమార్తె.. ఫొటోలు వైరల్!
Updated : Jan 11, 2022
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కొంత కాలం క్రితం రెండో భార్య కిరణ్ రావ్‌తో విడిపోయారు. ఇది చాలదన్నట్లు ఆయన మొదటి భార్య కుమార్తె ఇరా ఖాన్ ఇటీవల వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తన ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖారేతో ప్రేమలో పడటం ద్వారా ఇదివరకు వార్తల్లోకి ఎక్కిన ఇరా.. అప్పట్నుంచీ అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ మీడియాకు ఫేవరేట్‌గా మారింది. ఇప్పుడు మరోసారి గత నాలుగేళ్లుగా ఇనాక్టివ్‌గా ఉంటూ 20 కిలోల బరువు పెరిగిపోయానని తెలుపుతూ ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
Also read: న్యూ ఇయర్ హాలిడేస్ ఎంజాయ్ చేసొచ్చి.. ప్రియుడితో ముంబైలో ప్రత్యక్షమైన రకుల్!
నూపుర్‌తో ఉన్న ఫొటోలతో పాటు సింగిల్‌గా తీయించుకున్న ఫొటోలను షేర్ చేసిన ఇరా, "బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా ఇటీవల నేను 15 రోజులు ఉపవాసం ఉన్నాను. సెల్ఫ్ మోటివేషన్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాను. నా లైఫ్‌లో ఎక్కువ భాగం చాలా యాక్టివ్‌గా ఉన్నాను కానీ గత నాలుగైదేళ్లుగా చురుగ్గా లేను. దాంతో 20 కిలోల బరువు పెరిగాను. ఇది నాకెంతో కష్టంగా మారింది." అంటూ రాసుకొచ్చింది ఇరా.
Also read: జెనీలియాతో సల్మాన్ డాన్స్.. వీడియో వైరల్!
ఆమె లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో ఆమె చాలా బొద్దుగా కనిపిస్తోంది.