Read more!

English | Telugu

హిందీ 'పుష్ప‌'కు ఎదురే లేదు.. రూ. 80 కోట్ల మార్కు దాటాడు!

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషించ‌గా సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప' మూవీ హిందీ వెర్ష‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వండ‌ర్స్ క్రియేట్ చేస్తోంది. అంచ‌నాల‌ను మించి అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. ఎన్ని ర‌కాల అడ్డంకులు ఎదుర‌వుతున్నా బెదుర‌న్న‌దే లేకుండా మాస్ పాకెట్స్‌లో నాలుగో వారంలోనూ వేగంగా దూసుకుపోతోంది. నాలుగో వీకెండ్‌లో దాదాపు రూ. 8 కోట్ల నెట్ సాధించ‌డం అల్లు అర్జున్ ఏ రేంజ్‌లో హిందీ ఆడియెన్స్‌ను అల‌రిస్తున్నాడన్న దానికి నిద‌ర్శ‌నం. 

Also read: హిందీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న 'పుష్ప‌'.. రూ. 60 కోట్ల‌ను క్రాస్ చేసిన ఐకాన్ స్టార్‌!

తొలి వీకెండ్‌లో రూ. 12.68 కోట్లు, రెండో వీకెండ్‌లో 10.31 కోట్లు, మూడో వీకెండ్‌లో రూ. 15.85 కోట్లు రాబ‌ట్టిన 'పుష్ప' హిందీ వెర్ష‌న్ నాలుగో వీకెండ్‌లో రూ. 7.99 కోట్ల‌ను వ‌సూలు చేసింది. శుక్ర‌వారం రూ. 1.95 కోట్లు, శ‌నివారం రూ. 2.56 కోట్లు, ఆదివారం రూ. 3.48 కోట్లు వచ్చాయి. వెర‌సి మొత్తం 24 రోజుల‌కు రూ. 80.48 కోట్లు వ‌సూల‌య్యాయి. 

Also read: సెకండ్ డే మ‌రింత ఎక్కువ‌గా 'పుష్ప' హిందీ వ‌సూళ్లు! నార్త్‌లో బ‌న్నీ మేనియా!!

కొవిడ్ మ‌హ‌మ్మారి రోజులు, 'స్పైడ‌ర్‌మ్యాన్‌', '83' లాంటి సినిమాల పోటీ, అతి త‌క్కువ ప్ర‌మోష‌న్స్‌, త‌క్కువ స్క్రీన్లు, సాధార‌ణ టికెట్ ధ‌ర‌లు ఉన్న టైమ్‌లో 'పుష్ప' హిందీ వెర్ష‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చెల‌రేగుతున్న వైనాన్ని మొత్తం బాలీవుడ్ దిగ్భ్రాంతికి లోన‌వుతూ చూస్తోంది. ప్ర‌భాస్ త‌ర్వాత 'పుష్ప' మూవీతో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ రూపంలో మ‌రో పాన్ ఇండియా స్టార్ ఆవిర్భ‌వించాడ‌ని రూఢి అయిపోయింది. బాలీవుడ్‌కు చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు 'పుష్ప‌'లో బ‌న్నీ న‌ట‌న‌కు ఫిదా అయిపోయి, అత‌ని అభిమానుల‌మ‌య్యామ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా మెసేజ్‌లు పెడుతున్నారు.