Read more!

English | Telugu

ఆ సీక్వెల్ లో కృతి స‌న‌న్?

తెలుగు చిత్రం `1 నేనొక్క‌డినే`తో క‌థానాయిక‌గా తొలి అడుగేసిన కృతి స‌న‌న్.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది. కృతి చేతిలో ఇప్పుడు దాదాపు అర‌డ‌జ‌ను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న `ఆదిపురుష్` ఒక‌టి. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్న‌ ఈ మైథ‌లాజిక‌ల్ ట‌చ్ మూవీలో సీత‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది కృతి.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి కృతి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. కోలీవుడ్ మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ `మిన్న‌లే` (తెలుగులో `చెలి`)కి హిందీ వెర్ష‌న్ గా రూపొందిన `ర‌హ‌నా హై తేరే దిల్ మేనే` (2001)కి త్వ‌ర‌లో సీక్వెల్ రాబోతోంది. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ లో దియా మీర్జా పోషించిన రీనా మ‌ల్హోత్రా పాత్ర‌లో కృతి స‌న‌న్ కొన‌సాగ‌నుంద‌ని స‌మాచారం. మాధ‌వ‌న్, సైఫ్ అలీ ఖాన్ పాత్ర‌ల్లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒరిజిన‌ల్ ని గౌత‌మ్ మీన‌న్ డైరెక్ట్ చేయ‌గా.. సీక్వెల్ ని ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌నున్నార‌ని టాక్. `ర‌హ‌నా హై తేరే దిల్ మేనే` నిర్మాత వ‌శు భ‌గ్నాని త‌న‌యుడు జాకీ భ‌గ్నాని ఈ సీక్వెల్ ని ప్రొడ్యూస్ చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

మ‌రి.. 20 ఏళ్ళ త‌రువాత రాబోతున్న ఈ సీక్వెల్.. ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.