Read more!

English | Telugu

కత్రినా కైఫ్ సోదరుడితో ఇలియానా డేటింగ్!

గతంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమాయణం నడిపిన ఇలియానా.. ప్రస్తుతం మరో వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్.

భర్త విక్కీ కౌశల్, సోదరుడు సెబాస్టియన్ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లిన కత్రినా ఈ టూర్ కి సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఇలియానా కూడా ఉండటం విశేషం. సెబాస్టియన్ తో ఇలియానా డేటింగ్ లో ఉందని, అందుకే కత్రినా ఫ్యామిలీతో ఆమె వెకేషన్స్ వెళ్తుందని అంటున్నారు. సెబాస్టియన్ తో ఇలియానా ప్రేమలో ఉందంటూ బాలీవుడ్ మీడియా సైతం కోడై కూస్తోంది.

'దేవదాసు'(2006) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 'బర్ఫీ'(2012) సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ బ్యూటీ అక్కడ కూడా వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.