Read more!

English | Telugu

క‌త్రినా బ్ర‌ద‌ర్‌తో ఇలియానా డేటింగ్‌!

 

గోవా బ్యూటీ ఇలియానా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా? అవున‌నే చెప్తున్నాయి రిపోర్టులు. ఈసారి ఆమె లండ‌న్ నివాసి, మోడ‌ల్ అయిన సెబాస్టియ‌న్ లారెంట్ మిచెల్‌తో ప్రేమ‌లో ప‌డింది. అత‌నెవ‌రో కాదు, బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ క‌త్రినా కైఫ్‌ సోద‌రుడు. గ‌తంలో అత‌ను చివ‌రిసారిగా క‌త్రినా పెళ్లి సంద‌ర్భంగా ముంబై, రాజ‌స్థాన్‌ల‌లో క‌నిపించాడు. సెబాస్టియ‌న్‌, ఇలియానా దాదాపు ఆరు నెల‌లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ఇద్ద‌రూ బాంద్రాలోని క‌త్రినా పాత నివాసంలోనూ, లండ‌న్‌లోని స‌బ‌ర్బ‌న్ ఏరియాలోనూ క‌లుసుకున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల భోగ‌ట్టా. ఇన్‌స్టాలో సెబాస్టియ‌న్ త‌న హ్యాండిల్‌ను ప్రైవేట్‌గా ఉంచాడు.

మాల్దీవుల్లో జూలై 16న క‌త్రినా త‌న బ‌ర్త్‌డేని త‌న‌కు అత్యంత స‌న్నిహితులతో సంద‌డిగా జ‌రుపుకుంది. వారిలో ఇలియానా కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. క‌త్రినాతో పాటు ఆమె భ‌ర్త విక్కీ కౌశ‌ల్‌, సెబాస్టియ‌న్‌, ఇలియానా, ఇసాబెల్లే, ఆనంద్ తివారీ, మిని మాథుర్ సంద‌డి చేస్తున్న వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతోంది. మాల్దీవుల్లో క‌త్రినాతో క‌లిసి చిల్ అవుతున్న కొన్ని ఫొటోల‌ను ఇలియానా స్వ‌యంగా షేర్ చేసింది. అయితే, సెబాస్టియ‌న్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యంపై ఆమె ఇంకా పెద‌వి విప్ప‌లేదు.

కొంత కాలం క్రితం వ‌ర‌కూ ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా డేటింగ్‌లో ఉంది. సుదీర్ఘ కాలం సాగిన వారి అనుబంధం ఇప్పుడు గ‌తం. అత‌డితో విడిపోయిన‌ట్లు ఇలియానా చెప్పిన‌ప్ప‌టికీ, దానికి కార‌ణ‌మేమిటో మాత్రం ఆమె ఇంత‌దాకా వెల్ల‌డించ‌లేదు. అప్ప‌ట్నుంచీ త‌న వ‌ర్క్‌తో బిజీగా గ‌డుపుతూ సింగిల్‌గా ఉంటూ వ‌స్తోన్న ఇలియానా, వీలు ల‌భించిన‌ప్పుడ‌ల్లా వివిధ ప్ర‌దేశాల‌కు ప‌ర్య‌టిస్తూ, వాటికి సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేస్తోంది.