Read more!

English | Telugu

అనుష్క శ‌ర్మ‌-విరాట్ కోహ్లీ అంద‌మైన ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా?

 

అనుష్క శ‌ర్మ‌, విరాట్ కోహ్లి త‌మ ప‌ర్స‌న‌ల్ జీవితాల్ని గాసిప్పులు అల్లేవాళ్ల నుంచి ఎప్పుడూ దూరంగానే ఉంచుతూ వ‌చ్చారు. త‌మ మ్యారీడ్ లైఫ్ వివ‌రాల గురించి ప‌బ్లిక్‌లో రివీల్ చేయ‌డానికి వాళ్లెప్పుడూ ఇంట‌రెస్ట్ చూపించ‌లేదు. అయితే వారి బ్ర‌హ్మాండ‌మైన నివాసం గురించి తెలుసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఉవ్విళ్లూరుతుంటారు. 2016లో వాళ్లు ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసి, పెళ్లి చేసుకున్న త‌ర్వాత సీ-ఫేసింగ్ హోమ్‌కు మారారు. అక్కడే ఇప్పుడు ఓ బిడ్డ‌కు త‌ల్లిదండ్రుల‌య్యారు. 11 జ‌న‌వ‌రి 2021న వారికి ఓ పాప పుట్టింది. ఆ ఇంట్లో త‌మ లిటిల్ ప్రిన్సెస్‌ను మురిపంగా పెంచుకుంటూ వ‌స్తున్నారు ఆ దంప‌తులు. ‌

ఇంత‌కీ అనుష్క‌-విరాట్ ఇల్లు ఎక్క‌డ ఉందంటే.. ముంబైకి పొరుగునే ఉన్న వోర్లీలో సంప‌న్నులు నివ‌సించే చోట ఉంది. ఆ అపార్ట్‌మెంట్ విలువ అక్ష‌రాలా రూ. 34 కోట్లు!

మోడ‌ర‌న్ ఇంటీరియ‌ర్‌కు సింప్లిసిటీని జోడించి ఆ ఇంటిని త‌మ అభిరుచికి త‌గ్గ‌ట్లు తీర్చిదిద్దుకున్నారు. గోడ‌ల‌న్నీ వైట్‌వాష్‌తో, ఫ‌ర్నిచ‌ర్ అంతా లైట్ క‌ల‌ర్స్‌తో వాళ్ల టేస్ట్‌ను ప్ర‌తిఫ‌లిస్తుంటాయి.‌

అనుష్క‌, విరాట్‌ల ఫ్లాట్ 35వ అంత‌స్తులో ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ఆ ఇంట్లో అనుష్క ఏర్పాటుచేసిన గార్డెన్ ముచ్చ‌ట‌గా అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఆ గార్డెన్ ద‌గ్గ‌ర గ‌డుపుతూ దిగిన ఫొటోను అనుష్క షేర్ చేసింది కూడా.

లివింగ్ రూమ్‌లో పెద్ద టెలివిజ‌న్ స్క్రీన్‌ను వాళ్లు ఏర్పాటు చేసుకున్నారు.

ఫేమ‌స్ ప‌ర్స‌నాలిటీస్ కావ‌డంతో బ్రాండ్ షూట్స్ కోసం, ఫొటోలు దిగ‌డం కోసం ప్ర‌త్యేక‌మైన స్టూడియో లాంటిది పెట్టుకున్నారు.

విరాట్ కేవ‌లం క్రికెట‌ర్ మాత్ర‌మే కాదు, మంచి అథ్లెట్ కూడా. ఫిట్నెస్‌కు అమిత ప్ర‌యారిటీ ఇచ్చే అత‌ను ప్రైవేట్ జిమ్‌ను ఏర్పాటుచేసుకున్నారు. అందులో విరాట్‌తో పాటు అనుష్క కూడా వ‌ర్క‌వుట్స్ చేస్తూ ఫిట్‌గా ఉంటోంది.

ఆ ఇంటిపై ప్రైవేట్ టెర్రెస్ కూడా ఉంది. సాయంత్రం వేళ ఆ టెర్రెస్‌పై కూర్చొని క‌బుర్లు చెప్పుకోవ‌డానికి ఆ ఇద్ద‌రూ ఇష్ట‌ప‌డుతుంటారు.

నిజంగానే అదొక డ్రీమ్ హోమ్‌. ఆ ఇల్లు చూస్తే అలాంటిది మ‌న‌కూ ఉండాల‌ని ప్ర‌తి జంటా కోరుకుంటుందంటే.. అందులో ఆశ్చ‌ర్య‌మేమీ లేదు.