English | Telugu
పురుషులకు ఇచ్చినంత మాకూ ఇవ్వాలి!
Updated : Jul 28, 2023
ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో మోస్ట్ వర్సటైల్ యాక్ట్రెస్ హ్యూమా ఖురేషి. ఆమె ఫియర్‌లెస్ మాత్రమే కాదు, స్ట్రెయిట్‌ఫార్వర్డ్ గానూ ఉంటారు. రీల్స్‌లో ఎంత బోల్డ్‌గా కనిపిస్తారో, రియల్ లైఫ్‌లోనూ అలాగే ఉంటారు. సినిమాల్లోనూ ఆమె యాక్సెప్ట్ చేసే బోల్డ్, ఇంటలెక్చువల్ కేరక్టర్స్ జనాల మనసుల్ని దోచుకుంటాయి. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్‌లో సపోర్టింగ్ రోల్ చేసిన ఆమె, సౌత్‌లో రజనీకాంత్ పక్కన, అజిత్‌తోనూ నటించారు. పలు రకాల విషయాల గురించి ఇటీవల ముచ్చటించారు హ్యూమా ఖురేషి. పే పారిటీ గురించి కూడా మాట్లాడారు. మహారాణిలాంటి ప్రాజెక్టులు చేసిన తర్వాత పే పారిటీ గురించి మాట్లాడే ధైర్యం వచ్చిందా... అని అడగ్గా "నిజమే. నేను పే పారిటీ గురించి మాట్లాడగలను. ధైర్యంగా గొంతు విప్పగలను. నాతో పనిచేస్తున్న పురుషులు ఎంత పారితోషికం అందుకుంటున్నారో, అంత నేను కూడా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు అంత ఇ్వడం లేదు" అని అన్నారు.
ఈ సినారియో మారుతుందా అని ప్రశ్నించగా "నాకు తెలియదు. కానీ, అతి త్వరలోనే అది జరగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మనం ఇంత సేపు దీని గురించి చర్చించుకుంటూ ఉన్నాం. అయితే అది ఇప్పట్లో జరగదు అని కూడా నాకు తెలుసు`` అని అన్నారు. ఆమె మాట్లాడుతూ ``థియేట్రికల్ బిజినెస్ గురించి మర్చిపోండి. ఓటీటీలకు ఏమైంది? ఓటీటీల్లో పురుషులతో సమానంగా స్త్రీలకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు. నేను ఈ విషయం గురించి చాలా సార్లు నిర్మాతలతో మాట్లాడాను. కానీ పరిష్కారం రావడం లేదు" అని అన్నారు. "నేను ఒక యాక్షన్ సినిమా చేశానని అనుకోండి. ఆ సినిమాలో హీరో పడే శారీరక కష్టం నేను పడాలి. నేను పనిచేయాలి. కానీ నా స్థానంలో హీరో ఉంటే ఇచ్చే పారితోషికానికి, నా పారితోషికానికి అసలు పొంతనే ఉండదు. తప్పకుండా త్వరలోనే ఇదంతా మారుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు హ్యూమా.