Read more!

English | Telugu

ఈ టాప్‌ హీరోయిన్ల ఆస్తులెంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే!

 

అనేక రంగాల‌లో మాదిరిగానే ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కూడా మేల్ డామినేటింగ్ ఇండ‌స్ట్రీ అనేది తెలిసిందే. మేల్ స్టార్స్ పారితోషికాలు ఒక ర‌కంగా, ఫిమేల్ స్టార్స్ పారితోషికాలు ఇంకో ర‌కంగా ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ కొంత‌మంది హీరోయిన్లు సుదీర్ఘ కాలం రాణిస్తుండ‌టం ద్వారా చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఆస్తులు సంపాదించ‌గా, కొంత‌మంది హీరోయిన్లు ఇప్పుడిప్పుడే ఆస్తులు వెన‌కేసుకుంటూ వ‌స్తున్నారు. మ‌న‌కు బాగా తెలిసిన కొంత‌మంది తారలు ఎంత‌ రిచ్ అనేది తెలిసింది. రిప‌బ్లిక్ టీవీ ప్ర‌కారం ఇవి ర‌మార‌మి లెక్క‌లు. ఆ తార‌లెవ‌రు, వాళ్ల ఆస్తుల విలువేమిటో ఓ లుక్కేద్దాం...

క‌రీనా క‌పూర్ - రూ. 440 కోట్లు
బాలీవుడ్ హీరోయిన్ల‌లో 40 సంవ‌త్స‌రాల క‌రీనా క‌పూర్ రేంజే వేరు. సినిమాల‌తో పాటు జాతీయ‌, అంత‌ర్జాతీయ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో ఆమె ఆస్తుల విలువ రూ. 440 కోట్లకు చేరుకుంది.

Also read:  'పుష్ప‌'లో అల్లు అర్జున్‌కు డ‌బ్బింగ్ చెప్పింది ఈ హీరోనే!

అనుష్క శ‌ర్మ - రూ. 255 కోట్లు
ప‌ద్నాలుగేళ్లుగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న అనుష్క శ‌ర్మ.. టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు. సొంత నిర్మాణ సంస్థ కూడా ఉన్న ఆమె సంపాద‌న విలువ రూ. 255 కోట్ల‌ని అంచ‌నా.

క‌త్రినా కైఫ్ - రూ. 218 కోట్లు
ప‌దిహేడు సంవ‌త్స‌రాల క్రితం 'బూమ్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన క‌త్రినా కైఫ్ త‌న గ్లామ‌ర్‌తోటే టాప్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగారు. ఇటీవ‌లే బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ విక్కీ కౌశ‌ల్‌ను పెళ్లాడిన క‌త్రినా ఆస్తుల విలువ రూ. 218 కోట్లు.

Also read:  పిల్ల‌ల చ‌దువు ఖ‌ర్చులు నావి.. మిగ‌తా ఖ‌ర్చుల‌న్నీ మా ఆయ‌న‌వి!

అలియా భ‌ట్ - రూ. 162 కోట్లు
బాలీవుడ్‌లో అత్యంత గిరాకీ ఉన్న తార‌ల్లో ఒక‌రైన అలియా భ‌ట్ టాలీవుడ్‌కు 'ఆర్ఆర్ఆర్' మూవీతో ప‌రిచ‌యం కాబోతోంది. నెపోటిజం విమ‌ర్శ‌ల్ని బ‌లంగా ఎదుర్కొంటున్న ఈ అమ్మ‌డి ఆస్తుల విలువ రూ. 162 కోట్లు.

దీపికా ప‌డుకోనే - రూ. 118 కోట్లు
పదిహేనేళ్ల‌ క్రితం 'ఓం శాంతి ఓం' మూవీలో షారుఖ్ ఖాన్ జోడీగా న‌టించ‌డం ద్వారా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన 34 ఏళ్ల దీపికా ప‌డుకోనే ఇవాళ నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌. ఆమె ఆస్తుల నిక‌ర విలువ రూ. 118 కోట్లు.

Also read:  య‌శ్‌ను క్ష‌మించ‌మ‌ని కోరిన ఆమిర్‌.. రీజ‌న్ ఏంటో తెలుసా?

తాప్సీ ప‌న్ను - రూ. 44 కోట్లు
కొంత కాలం టాలీవుడ్‌లో ప‌నిచేసి, త‌ర్వాత బాలీవుడ్‌లో దాదాపుగా సెటిల్ అయిపోయిన తాప్సీ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తో మంచి మార్కెట్ తెచ్చుకుంది. నిక‌రంగా ఆమె ద‌గ్గ‌ర రూ. 44 కోట్ల ఆస్తులున్నాయి.