'పుష్ప'లో అల్లు అర్జున్‌కు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోనే!
on Dec 8, 2021
సోమవారం రాత్రి విడుదల చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప: ది రైజ్' ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తూ దూసుకుపోతోంది. అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేసిన ఈ మూవీని సుకుమార్ డైరెక్ట్ చేశాడు. రష్మిక మందన్న హీరోయిన్గా, విలన్‌గా ఫహద్ ఫాజిల్ నటించారు. మంగళవారం మధ్యాహ్నం హిందీ వెర్షన్ ట్రైలర్ ఆవిష్కరించారు. రెండున్నర నిమిషాల ఆ చిన్న ట్రైలర్లోనే ఎర్రచందనం స్మగ్లర్‌గా బన్నీ కనిపించిన తీరు, అతను చెప్పిన డైలాగ్స్ అదరహో అనిపించాయి. బన్నీ నోటి వెంట వచ్చిన హిందీ డైలాగ్స్ చెప్పిందెవరో తెలుసా? బాలీవుడ్లో టాలెంటెడ్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ్రేయాస్ తల్పడే. అవును. 'పుష్ప' హిందీ వెర్షన్లో బన్నీ క్యారెక్టర్‌కు అతను వాయిస్ ఇచ్చాడు.
'పుష్ప: ది రైజ్' హిందీ ట్రైలర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన శ్రేయాస్, హిందీలో అల్లు అర్జున్ క్యారెక్టర్‌ను తను వాయిస్ ఇచ్చినట్లు వెల్లడించాడు. "పుష్ప (హిందీ)లో ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్టైలిష్ యాక్టర్ అల్లు అర్జున్‌కు వాయిస్ ఇవ్వడం అమితానందకరంగానూ, గౌరవంగానూ భావిస్తున్నా." అని అతను ట్వీట్ చేశాడు.
Also read: ఆర్థిక నేరగాడు సుఖేశ్‌తో రిలేషన్షిప్లో జాక్వలిన్? ఫొటో వైరల్!
'పుష్ప'ను డైరెక్టర్ సుకుమార్ రెండు భాగాలుగా తీస్తున్నాడు. తొలి భాగం 'పుష్ప: ది రైజ్' తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్ 17న విడుదలవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాతో మలయాళం స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నాడు. పుష్పరాజ్‌ను ఢీకొట్టే భన్వర్‌సింగ్ షెకావత్ అనే పోలీసాఫీపర్ క్యారెక్టర్లో అతను కనిపించనున్నాడు.
Also read: షాహిద్ కపూర్ పేరుతో విసిగిపోయిన విద్యా బాలన్!
కాగా, నగేశ్ కుకునూర్ డైరెక్ట్ చేసిన 'ఇక్బాల్' మూవీతో వెలుగులోకి వచ్చిన శ్రేయాస్ తల్పడే.. డోర్, గోల్మాల్ రిటర్న్స్, గోల్మాల్ 3, హౌస్‌ఫుల్ 2, కమాల్ ధమాల్ మలమాల్, పోస్టర్ బాయ్స్, గోల్మాల్ అగైన్ తదితర సినిమాలతో నటునిగా మంచి పేరు సంపాదించాడు.
Also Read