English | Telugu

బిగ్ బి, షారూక్, హృతిక్ మ‌ల్టిస్టార‌ర్ `క‌భీ ఖుషి క‌భీ ఘ‌మ్`కి 20 ఏళ్ళు!

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన ద‌ర్శ‌కుల్లో క‌ర‌ణ్ జోహార్ ఒక‌రు. స‌క్సెస్ రేట్ ఎక్కువ ఉన్న బాలీవుడ్ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రిగా మన్న‌న‌లు పొందిన క‌ర‌ణ్.. షారూక్ ఖాన్, కాజోల్ జంట‌గా న‌టించిన `కుచ్ కుచ్ హోతా హై` (1998) కోసం తొలిసారిగా మెగాఫోన్ ప‌ట్టాడు. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే సంచ‌ల‌నం విజ‌యం సాధించాడు. ఆపై ఇదే జంట‌తో పాటు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ - జ‌యా భాదురి, హృతిక్ రోష‌న్ - క‌రీనా క‌పూర్ ప్ర‌ధాన జోడీలుగా త‌న ద్వితీయ చిత్రం `క‌భీ ఖుషి క‌భీ ఘ‌మ్` తీశాడు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమా 210 నిమిషాల నిడివితో సాగినా బాక్సాఫీస్ ముంగిట అఖండ విజ‌యం సాధించ‌డం విశేషం.

ఢీ 14: సుధీర్ పోయి సార్థ‌క్ వ‌చ్చె.. ఏం జ‌రిగిందో!?

మూడు వేర్వేరు త‌రాల‌కు చెందిన ముగ్గురు స్టార్స్ (బిగ్ బి, షారూక్, హృతిక్)తో క‌ర‌ణ్ చేసిన ఈ మ‌ల్టిస్టార‌ర్ ప్ర‌య‌త్నం.. భార‌తీయ ప్రేక్ష‌కుల‌నే కాదు ఓవ‌ర్సీస్ లోనూ రంజింప‌జేసింది. ఎమోష‌న్స్, పెర్ఫార్మెన్సెస్, సాంగ్స్, టెక్నిక‌ల్ టీమ్ మాయాజాలం.. వెర‌సి `కే3జీ` (క‌భీ ఖుషి క‌భీ ఘ‌మ్) భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ క్లాసిక్ గా నిలిచింది. ప్రేక్ష‌కుల రివార్డుల‌తో పాటు 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సైతం సొంతం చేసుకుంది. 2001 డిసెంబ‌ర్ 14న విడుద‌లై జ‌న‌నీరాజ‌నాలు అందుకున్న `క‌భీ ఖుషి క‌భీ ఘ‌మ్`.. నేటితో 20 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.