Read more!

English | Telugu

సిద్ధార్థ్ - కియారా పెళ్లి: హ‌ల్దీ, సంగీత్ డీటైల్స్!

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో పెళ్లికి రెడీ అవుతున్నారు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వానీ. జైస‌ల్మేర్‌లో ఫిబ్ర‌వ‌రిలో వీరి వివాహం జ‌ర‌గ‌నుంది. రీసెంట్‌గా దుబాయ్‌లో న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు ఈ జంట‌. మ‌నీష్ మ‌ల్హోత్రా, రాణీ ముఖ‌ర్జీ, క‌ర‌ణ్‌ జోహార్ కూడా వీరి ఆనందంలో పాలుపంచుకున్నారు. ఫిబ్ర‌వ‌రిలో పంజాబీ స్టైల్‌లో పెళ్లి చేసుకోవ‌డానికి రెడీ అవుతున్నారు సిద్ కియారా. రెండు  రోజులు ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. ముంబైలో గ్రాండ్‌గా రిస‌ప్ష‌న్‌ని ప్లాన్ చేసుకుంటున్నారు.

హ‌ల్దీ, సంగీత్ ఒకేరోజు నిర్వ‌హించుకోనున్నారు ఈ జంట‌. పెళ్లికి ఇరువైపుల వాళ్లు షాపింగ్ ప‌నులు మొద‌లుపెట్టార‌ట‌. మేరీగోల్డ్, ఎల్లో థీమ్‌తో ఔట్‌ఫిట్స్ ని రెడీ చేస్తున్నార‌ట హల్దీ ఫంక్ష‌న్ కోసం. సంగీత్‌లో ప్లే చేయాల్సిన ప్లే లిస్టులు కూడా రెడీ అవుతున్నాయ‌ట‌. 

ఇద్ద‌రి త‌ర‌ఫు ద‌గ్గ‌రి బంధువుల‌తో పాటు క‌ర‌ణ్‌ జోహార్‌, ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా, ప్రొడ్యూస‌ర్ అశ్విని యార్డి పెళ్లిలో త‌ప్ప‌క పాల్గొంటార‌ట‌. ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లోనే పెళ్లి ఉంటుంద‌ట‌. ఫిబ్ర‌వ‌రి 4, 5న ముంద‌స్తు కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటార‌ట‌. ఫిబ్ర‌వ‌రి 6న మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టి కానున్నార‌ట‌. ఇప్ప‌టికే జైస‌ల్మేర్ ప‌రిస‌రాల్లో ఉన్న హోట‌ల్స్ అన్నిటినీ బుక్ చేసేశార‌ట సిద్ కియారా. ఫిబ్ర‌వ‌రి 3న సిద్, కియారా జైస‌ల్మేర్‌కి చేరుకుంటార‌ట‌.

వీరిద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. లాస్ట్ ఇయ‌ర్ వ‌చ్చిన 'షేర్‌షా' వీరి లైఫ్‌లో గుర్తుండిపోయే సినిమా. ఇప్పుడు సౌత్‌లో రామ్‌చ‌ర‌ణ్ తో సినిమా చేస్తోంది కియారా. సౌత్ హీరోయిన్ ర‌ష్మిక‌తో 'మిష‌న్ మ‌జ్ను'లో న‌టిస్తున్నాడు సిద్‌.