English | Telugu

షారుక్ - హిరాణి మూవీ.. నేప‌థ్యం అదేనా?

బాలీవుడ్ లో అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక గుర్తింపు పొందాడు రాజ్ కుమార్ హిరాణి. `మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్` (2003), `ల‌గే ర‌హే మున్నాభాయ్` (2006), `3 ఇడియ‌ట్స్` (2009), `పీకే` (2014), `సంజు` (2018).. ఇలా వ‌రుస‌గా ఐదు బ్లాక్ బ‌స్ట‌ర్స్ కొట్టిన హిరాణి.. త్వ‌ర‌లో డ‌బుల్ హ్యాట్రిక్ కి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. అంతేకాదు.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కాంబినేష‌న్ లో ఈ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు.

ఇదిలా ఉంటే.. త‌న ప్ర‌తీ చిత్రంలో సున్నిత‌మైన హాస్యంతో పాటు సామాజిక సందేశాన్ని జోడించే హిరాణి.. షారుక్ తో చేయ‌బోయే సినిమాకి కూడా అదే పంథాని కొన‌సాగిస్తున్నాడ‌ట‌. కాగా, ఈ చిత్రం వ‌ల‌స జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంద‌ని.. సింహ‌భాగం కెన‌డాలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంద‌ని బాలీవుడ్ ఖ‌బ‌ర్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

షారుక్ ఖాణ్ - రాజ్ కుమార్ హిరాణి కాంబో మూవీలో క‌థానాయిక‌గా తాప్సీ న‌టించ‌నుంది. 2022 ప్ర‌థ‌మార్ధంలో ప‌ట్టాలెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2023లో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.