Read more!

English | Telugu

మేం పెళ్లి ప్లానింగ్‌లో ఉండ‌గా నేను ప్రెగ్నెంట్ అనే విష‌యం తెలిసింది!

 

ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త వైభ‌వ్ రేఖిని పెళ్లాడిన వైల్డ్ డాగ్ న‌టి దియా మీర్జా అత‌డితో తొలి బిడ్డ‌ను క‌న‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. చాలా మంది స్నేహితులు, అభిమానులు ఆమెకు శుభాభినంద‌న‌లు తెలియ‌జేయ‌గా, ఆమె పెళ్లాడిన స‌మ‌యంపై కొంత‌మంది ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. ఇది ఓ వివాదంగా మార‌డం మ‌నం చూశాం. పెళ్ల‌యిన ఒక‌టిన్న‌ర నెల‌కు తాను గ‌ర్భ‌వ‌తిన‌ని ఆమె ప్ర‌క‌టించ‌డంపై కొంత‌మంది ట్రోల్ చేశారు.

త‌న ప్రెగ్నెన్సీని దియా ప్ర‌క‌టించిన పోస్ట్‌కు కామెంట్ సెక్ష‌న్‌లో ఒక ఫాలోయ‌ర్‌, బాగుంది, కంగ్రాట్స్‌. కానీ ప్రాబ్లెమ్ ఏమంటే, త‌న ప్రెగ్నెన్సీని పెళ్లికి ముందే ఆమె ఎందుకు అనౌన్స్ చేయ‌లేదు, స్టీరియోటైప్‌ను బ్రేక్ చెయ్యాల‌ని ఎందుకు అనుకోలేదు?  పెళ్లి త‌ర్వాతే ప్రెగ్నెంట్ అవ‌డమ‌నే స్టీరియోటైప్‌ను మ‌నం ఫాలో అవ‌డం కాదా? పెళ్లికి ముందే స్త్రీలు ఎందుకు ప్రెగ్నెంట్ కాకూడ‌దు? అని ప్ర‌శ్నించాడు.‌

ఆ ఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్‌కు రిప్లై ఇచ్చింది దియా. ఇంట‌రెస్టింగ్ క్వ‌శ్చ‌న్‌. ముందుగా, మేం బిడ్డ‌ను క‌న‌బోతున్న కార‌ణంగా పెళ్లి చేసుకోలేదు. క‌లిసి జీవించాల‌ని కోరుకున్నందున మేం పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లికి ప్లాన్ చేసుకుంటున్న‌ప్పుడు మాకు బేబీ పుట్ట‌బోతున్న‌ద‌నే విష‌యం తెలిసింది. అందువ‌ల్ల ప్రెగ్నెన్సీ ఫ‌లితంగా మా పెళ్లి జ‌ర‌గ‌లేదు. మెడిక‌ల్ రీజ‌న్స్ కార‌ణంగా బేబీ సుర‌క్షితంగా ఉంద‌ని తెలిసేదాకా మేం ప్రెగ్నెన్సీని ప్ర‌క‌టించ‌లేదు. నా జీవితంలో ఇది అత్యంత ఆనంద‌క‌ర‌మైన వార్త‌. దీని కోసం చాలా ఏళ్లుగా నేను ఎదురుచూశాను. మెడిక‌ల్ కాకుండా వేరే కార‌ణంగా నేను దీన్ని దాచే మార్గం లేదు. అని ఆమె తెలిపింది.