Read more!

English | Telugu

నిన్న బాయ్‌ఫ్రెండ్‌కు.. నేడు క‌త్రినాకు క‌రోనా!

 

బాలీవుడ్ స్టార్స్ ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా కొవిడ్ 19 బారిన ప‌డుతున్నారు. లేటెస్ట్‌గా స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్‌కు ఆ వైర‌స్ సోకింది. మంగ‌ళ‌వారం ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా త‌న‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఆమె బాయ్‌ఫ్రెండ్‌, హీరో విక్కీ కౌశ‌ల్ సోమ‌వార‌మే త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలిన‌ట్లు వెల్ల‌డించాడు. ఈ ఇద్ద‌రి కంటే ముందు క‌త్రినా హీరోయిన్‌గా న‌టిస్తోన్న 'సూర్య‌వంశీ' మూవీ హీరో అక్ష‌య్ కుమార్ క‌రోనా బారిన ప‌డి హాస్పిట‌ల్‌లో చేరాడు.

త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో క‌త్రినా, "నాకు కొవిడ్‌-19గా టెస్ట్‌లో నిర్ధార‌ణ అయ్యింది. వెంట‌నే స్వీయ ఐసోలేష‌న్‌లోకి వెళ్లాను. ప్ర‌స్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. నా డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు అన్ని సుర‌క్షిత విధానాలు ఫాలో అవుతున్నాను." అని రాసుకొచ్చింది.

త‌న‌తో స‌న్నిహితంగా మెల‌గిన వారినంద‌రినీ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా ఆమె కోరింది. "నాకు ద‌గ్గ‌ర‌గా మెలిగిన అంద‌రినీ వెంట‌నే టెస్ట్ చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ప్రేమ‌, స‌పోర్ట్‌కు రుణ‌ప‌డి ఉంటాను." అని ఆమె చెప్పింది.

అంత‌కు ముందు సోమ‌వారం క‌త్రినా బాయ్‌ఫ్రెండ్ విక్కీ కౌశ‌ల్ త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని ప్ర‌క‌టించాడు. "అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు, శ్ర‌ద్ధ తీసుకుంటున్న‌ప్ప‌టికీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. అన్ని ర‌కాల ప్రోటోకాల్స్ పాటిస్తూ హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ, నా డాక్ట‌ర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడుతున్నాను." అని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్టేట్‌మెంట్ ద్వారా తెలిపాడు.