English | Telugu

భ‌ర్త ర‌ణ‌వీర్‌తో క‌లిసి హాస్పిట‌ల్‌కు వెళ్లిన దీపిక‌.. ప్రెగ్నెంట్ అంటూ ప్ర‌చారం!

బాలీవుడ్ ఫేవ‌రేట్ క‌పుల్ దీపికా ప‌డుకోనే, ర‌ణ‌వీర్ సింగ్ ముంబైలోని హిందూజా హాస్పిట‌ల్ ద‌గ్గ‌ర శ‌నివారం క‌నిపించడంతో దీపిక ప్రెగ్నెంట్ అయ్యిందంటూ ఇంట‌ర్నెంట్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కారులో వ‌చ్చిన వారి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దాంతో వారి ఫ్యాన్స్ దీపిక ప్రెగ్నెంట్ అయ్యిందా అంటూ ఆరాలు తీస్తున్నారు.

కొంత కాలం డేటింగ్ త‌ర్వాత 2018 న‌వంబ‌ర్‌లో ఇట‌లీలో దీపిక‌, ర‌ణ‌వీర్ పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి ఇరువురి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, స‌న్నిహిత స్నేహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఈరోజు భ‌ర్త ర‌ణ‌వీర్‌తో పాటు ముంబైలోని హిందూజా హాస్పిట‌ల్‌కు వ‌చ్చింది దీపిక‌. వైట్ టీ-ష‌ర్ట్‌, బ్లాక్ స‌న్‌గ్లాసెస్‌, బ్లాక్ అండ్ ఎల్లో ప్రింటెట్ క్యాప్‌తో ఎప్ప‌ట్లా డాప‌ర్ లుక్‌లో ర‌ణ‌వీర్ క‌నిపించ‌గా, బ్లాక్ టాప్ అండ్ షేడ్స్‌లో దీపిక గార్జియ‌స్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. హాస్పిట‌ల్‌కు ఆ జంట ఎందుకు వెళ్లింద‌నే విష‌యం బ‌య‌ట‌కు రాలేదు. కానీ వారి ప్రెగ్నెన్సీ వ‌దంతులు మాత్రం ఇంట‌ర్నెట్‌ను తుఫానులా చుట్టుముట్టాయి. వారి అశేష అభిమాన గ‌ణం మాత్రం ఆ ఇద్ద‌రి నుంచి ఎప్పుడు గుడ్ న్యూస్ వింటామా అని కుతూహ‌లంగా ఎదురుచూస్తున్నారు.

దీపిక ప్రెగ్నెన్సీ వదంతులు వ్యాపించ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ కాదు. 2019లోనూ ఇదే త‌ర‌హా వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. మెట్ గాలా 2019 ఆఫ్ట‌ర్‌-పార్టీలో దీపిక క‌నిపించిన తీరుచూసి ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందంటూ వ‌దంతులు మొద‌ల‌య్యాయి. కానీ అవి నిజం కాలేదు. మ‌రి ఇప్పుడేమ‌వుతుందో చూడాలి. ఇంత‌కీ వారు హాస్పిట‌ల్‌కు ఎందుకు వెళ్లారు?