English | Telugu

న్యూడ్ యోగా చెయ్య‌మ‌న్న‌ బీబీ ఓటీటీ నిర్వాహ‌కులు.. రోజుకు 50 ల‌క్ష‌లు అడిగిన యోగా గురు!

స‌ల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న బిగ్ బాస్ త‌దుప‌రి సీజ‌న్ కోసం దేశ‌వ్యాప్తంగా వీక్ష‌కులు ఎదురుచూస్తుండ‌గా, ఫ్యాన్స్‌ను, వ్యూయ‌ర్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌కు వ‌స్తోంది ఆ షో. కొన్ని రోజులుగా 'బిగ్ బాస్ ఓటీటీ' షో రానున్న‌ద‌ని ప్ర‌చారం న‌డుస్తుండ‌గా, ఆ షోకు హోస్ట్‌గా క‌ర‌ణ్ జోహార్ ఎంపిక‌య్యాడు. ఫైన‌లైజ్ అయిన కంటెస్టెంట్ల లిస్ట్ బ‌య‌ట‌కు రాలేదు కానీ, ప‌లువురి పేర్లు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇటీవ‌ల 'బీబీ ఓటీటీ' షో కోసం కంటెస్టెంట్‌గా త‌న‌ను సంప్ర‌దించార‌నీ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్, భార‌త‌దేశ‌పు తొలి న్యూడ్ యోగా గురు వివేక్ మిశ్రా తెలిపాడు. అంతేకాదు, వారు త‌న‌ను న్యూడ్ లేదా సెమి-న్యూడ్ యోగా చెయ్యాల్సి ఉంటుంద‌ని చెప్ప‌డంతో తాను తిర‌స్క‌రించాన‌ని వెల్ల‌డించాడు.

ఆన్‌లైన్ కంటెంట్ మీద ఎక్కువ రెస్ట్రిక్ష‌న్స్ లేక‌పోవ‌డంతో 'బిగ్ బాస్ ఓటీటీ' నిర్వాహ‌కులు వివేక్‌ను న్యూడ్ లేదా సెమి-న్యూడ్‌గా యోగా చెయ్య‌మ‌ని అడిగారు. దాంతో అత‌ను ఆ షో నుంచి విర‌మించుకున్నాడు. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో వివేక్ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. "నేను స్టార్లెట్‌ను కాను. న్యూడ్ యోగా చెయ్యాల్సి ఉండే షోలో పాల్గొనాల‌ని నేన‌నుకోవ‌డం లేదు." అని అత‌ను చెప్పాడు.

"కంటెంట్‌ను రంజుగా చేయ‌డానికి న్యూడ్ యోగా చెయ్యాల‌ని ఓటీటీ షో నుంచి నాకు ఆఫ‌ర్ వ‌చ్చింది. అది విన‌గానే నేను అందులో భాగం కావ‌డాన్ని విర‌మించుకున్నాను. ఈ షోకు పాపులారిటీ తీసుకురావ‌డానికి ఐదుగురు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసం చూస్తున్న‌ట్లు వారు చెప్పారు. ఒక పేరుపెందిన రియాలిటీ షో కంటెంట్ కోసం నేనెందుకు న్యూడ్ యోగా చెయ్యాలి. నేను చాలా సెక్సీ. ఆ ప‌నిచెయ్యాలంటే నాకు బాగా ముట్ట‌చెప్పాలి. నా నుంచి న్యూడ్ యోగాను మీరు ఆశిస్తున్న‌ట్ల‌యితే రోజుకు రూ. 50 ల‌క్ష‌లు చెల్లించాల‌ని వారికి చెప్పాను." అని వెల్ల‌డించాడు వివేక్‌.