English | Telugu

భ‌ర్త కోసం దీపిక ప్ర‌త్యేక గీతం

ర‌ణ్ వీర్ సింగ్, దీపికా ప‌దుకొణే.. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ సూప‌ర్ జోడీ. పెళ్ళ‌య్యాక ఈ ఇద్ద‌రూ క‌ల‌సి న‌టించిన తొలి చిత్రం `83`. జూన్ 4న ఈ స్పోర్ట్స్ డ్రామా తెర‌పైకి రానుంది. ఇందులో క‌పిల్ దేవ్ పాత్ర‌లో ర‌ణ్ వీర్ న‌టించ‌గా.. క‌పిల్ శ్రీ‌మ‌తి రోమీ భాటియాగా దీపిక ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. కాగా, `83` విడుద‌ల‌య్యేలోపే.. ర‌ణ్ వీర్ తో మ‌రోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంద‌ట దీపిక‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ర‌ణ్ వీర్ ద్విపాత్రాభిన‌యంలో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి `స‌ర్క‌స్` పేరుతో ఓ భారీ బ‌డ్జెట్ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ర‌ణ్ వీర్ కి జోడీగా పూజా హెగ్డే, జాక్వ‌లైన్ ఫెర్నాండేజ్ న‌టిస్తున్నారు. కాగా, ఇందులో ఓ ప్ర‌త్యేక గీతానికి కూడా స్థాన‌ముంద‌ని.. అందులో దీపిక చిందులేయ‌నుంద‌ని బాలీవుడ్ ఖ‌బ‌ర్. మ‌రి.. భ‌ర్త కోసం దీపిక చేయ‌నున్న ఈ ప్ర‌త్యేక గీతం సినిమాకి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే.. దీపిక ప్ర‌స్తుతం శ‌కున్ బ‌త్రా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పేరు నిర్ణ‌యించ‌ని చిత్రంలోనూ, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ `ప‌ఠాన్`లోనూ నాయిక‌గా న‌టిస్తోంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.