Read more!

English | Telugu

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ కు భారీ ఊరట!

డ్రగ్స్‌ కేసులో అరెస్టయ్యి బెయిల్‌ పై విడుదలైన బాలీవుడ్ స్టార్ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ప్రతి శుక్రవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో హాజరు కావాలన్న బెయిల్‌ షరతు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. 

క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్‌ కేసులోఎన్సీబీ అధికారులు ఆర్యన్‌ తో పాటు పలువురిని అక్టోబర్ 3న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ముంబై హైకోర్టు మూడు వారాల క్రితం ఆర్యన్‌ కు షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది. బెయిల్ షరతు ప్రకారం ముంబైలోని ఎన్సీబీ ఆఫీసు ఎదుట ప్రతి శుక్రవారం ఆర్యన్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ కేసు దర్యాప్తు ఢిల్లీలోని ఎన్సీబీ ఆధ్వర్యంలో ఉన్న సిట్ కు బదిలీ కావడంతో.. ముంబై ఎన్సీబీ ఆఫీసులో హాజరు కావాలన్న షరతును సడలించాలంటూ ఆర్యన్ తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

బుధవారం జరిగిన విచారణలో.. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో హాజరు కావాలన్న బెయిల్‌ షరతు నుంచి మినహాయింపు ఇచ్చిన హైకోర్టు.. బెయిల్‌ షరతు నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. "ఢిల్లీలోని ఎన్సీబీ కార్యాలయం ఎప్పుడు సమన్లు పంపినా 72గంటల్లోగా సిట్ ముందు తప్పక హాజరు కావాలి. ముంబైని వదిలి వెళ్లేటప్పుడు దర్యాప్తు అధికారులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి " అని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.