Read more!

English | Telugu

లెజెండరీ యాక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నా

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'ఛత్రపతి' రీమేక్ తో ఆయన హిందీ చిత్రసీమలో అడుగుపెడుతున్నాడు. వీవీ వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హిందీ సీనియర్ యాక్టర్, కామెడీ కింగ్ జానీ లీవర్ నటిస్తున్నట్లు తాజాగా బెల్లకొండ తెలియజేశారు.

జానీ లీవర్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన బెల్లంకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు. లెజెండరీ యాక్టర్ జానీ లీవర్ గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని బెల్లంకొండ తెలిపారు. ఆయన రాకతో సెట్ లో కొత్త ఎనర్జీ వచ్చిందని బెల్లంకొండ పేర్కొన్నారు. జానీ లీవర్ తో బెల్లంకొండ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పెన్ స్టూడియోస్ బ్యానర్ పై ధవల్ జయంతిలాల్ గడా 'ఛత్రపతి' హిందీ రీమేక్ ను నిర్మిస్తున్నారు.