English | Telugu

నన్ను కొట్టాడు, కడుపులో తన్నాడు, మెడపట్టుకుని బయటకు గెంటేశాడు!

బాలీవుడ్‌లో మరో గృహహింస కేసు బయటపడింది. ఫేమస్ సింగర్ హానీ సింగ్‌పై అతడి భార్య షాలిని పెట్టిన కేసు మరువకముందే 'నాగిన్ 2' నటి అర్జూ గోవిత్రికర్ భర్తపై చేసిన ఆరోపణలు బాలీవుడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్ అయ్యాయి. భర్త నుండి విడాకులు కోరుతూ ఆమె కోర్టు మెట్లు ఎక్కారు.

సినిమాలు, సీరియళ్ళలో అర్జూ గోవిత్రికర్ పలు పాత్రలు చేశారు. ఫిబ్రవరి 2019లో భర్త సిద్ధార్థ్ సబర్వాల్ మీద ఆమె గృహహింస కేసు పెట్టారని తెలుస్తోంది. అయితే, ఇన్నాళ్లూ వ్యక్తిగత జీవితం గురించి మౌనం వహించిన అర్జూ గోవిత్రికర్, తాను భర్త చేతిలో తన్నులు తిన్నానని, వేధింపులకు గురయ్యానని చెప్పారు.

"నేను విడాకుల కోసం అప్లై చేశా. ఈ విషయంలో నేనింకా అబద్ధం ఆడాలని అనుకోవడం లేదు. నా గౌరవాన్ని తాకట్టు పెట్టాను. శాయశక్తులా ప్రయత్నించా. కానీ, సిద్ధార్థ్ తో కొనసాగడం నా వల్ల కాదు. అతడు నన్ను తీవ్రంగా కొట్టాడు. నా కడుపులో కాలితో తన్నాడు. నన్ను మెదపట్టుకుని బలవంతంగా బయటకు గెంటేసి ప్రయత్నం చేశాడు. నా గాయాలు బయటకు కనిపించకూడదని బయటకు కూడా వచ్చేదాన్ని కాదు. సిద్ధార్థ్ కు రష్యన్ గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసింది. ఆమెతో చేసిన చాటింగ్స్ కూడా ఉన్నాయి. నాపై వయలెన్స్ కి పాల్పడ్డ సమయంలో సీసీ టీవీ ఫుటేజ్ ఉంది. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా" అని అర్జూ గోవిత్రికర్ పేర్కొంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.