English | Telugu

విడాకులు తీసుకొని మా అమ్మానాన్న‌లు మంచి ప‌నే చేశారు!

బాలీవుడ్ తార‌లు అమృతా సింగ్‌, సైఫ్ అలీఖాన్ 2004లో విడాకులు తీసుకున్నారు. ఒక సినిమా సెట్స్ మీద తొలిసారి క‌లుసుకున్న ఆ ఇద్ద‌రూ ప్రేమ‌లోప‌డి, 1991లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వారి వివాహం టాక్ ఆఫ్ ద టౌన్‌. సైఫ్ కంటే అమృత వ‌య‌సులో బాగా పెద్ద కావ‌డం కూడా దీనికో కార‌ణం. ప‌ద‌మూడేళ్ల వైవాహిక జీవితం, ఇద్ద‌రు పిల్ల‌లు క‌లిగాక వారు విడిపోయారు.

త‌మ విడాకుల వ్య‌వ‌హారం పిల్ల‌ల జీవితాల‌పై ప్ర‌భావం చూపించ‌కూడ‌ద‌ని అమృత‌, సైఫ్ భావించారు. పిల్ల‌ల‌ను పెంచే బాధ్య‌త‌ను అమృత తీసుకుంది. వాళ్ల‌కు ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా తానుంటాన‌ని సైఫ్ మాటిచ్చాడు. అలా సారా, ఇబ్ర‌హీం త‌ల్లితో క‌లిసి జీవిస్తూనే, ఎప్పుడు కావాలంటే అప్పుడు తండ్రి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గ‌లుగుతున్నారు.

రీసెంట్‌గా ఒక ఇంట‌ర్వ్యూలో సారా అలీఖాన్‌కు త‌ల్లిదండ్రుల‌పై ఆమె ఒపీనియ‌న్ ఏమిటి, వాళ్ల డైవోర్స్‌ను ఎలా డీల్ చేస్తుంటావు అనే ప్ర‌శ్న ఎదురైంది. "ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్ద‌రిలో ఎవ‌రూ హ్యాపీగా ఉండ‌న‌ప్పుడు, ఎవ‌రి జీవితాన్ని వారు హ్యాపీగా జీవించాల‌నుకున్న‌ప్పుడు విడిపోవ‌డ‌మే మంచిది. నేను మా అమ్మ‌తో క‌లిసుంటున్నాను. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్‌. నాకు అన్నీ ఆమే. నాకో నాన్న కూడా ఉన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్‌లో అందుబాటులో ఉంటారు. నేనెప్పుడు కావాల‌నుకుంటే అప్పుడు ఆయ‌న‌ను క‌లుసుకోగ‌ల‌ను. ఆ ఇద్ద‌రూ క‌లిసున్న‌ట్ల‌యితే హ్యాపీగా ఉండేవార‌ని నేన‌నుకోను. విడిపోవాల‌ని ఆ టైమ్‌లో వారు మంచి డెసిష‌న్ తీసుకున్నారు." అని చెప్పింది సారా.

అమృత నుంచి విడిపోయిన ఎనిమిదేళ్ల‌కు క‌రీనా క‌పూర్‌ను రెండో వివాహం చేసుకున్నాడు సైఫ్‌. ఆమెతో ఇద్ద‌రు కొడుకుల‌ను క‌న్నాడు. మ‌రోవైపు అమృత సింగిల్ మ‌ద‌ర్‌గా సారా, ఇబ్ర‌హీంల‌ను పెంచి పెద్ద‌చేసింది.